ఒక్కోసారి మన ఎదుటనున్నవారు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. కానీ వారికి సంబంధించిన వాస్తవం తెలిస్తే అయ్యో… అలాగనుకున్నామే! అని నాలుక కరుచుకుంటాం. ఇటువంటి ఘటనే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటుచేసుకుంది. రోడ్డు పక్కగా ఉన్న చలితో వణుకుతున్న ఒక యాచకుణ్ణి చూసిన డీఎస్పీ అతనిని ఆదుకుందామని దగ్గరకు వెళ్లారు. అతనిని దగ్గరనుంచి చూసి షాకయ్యారు. యాచకునిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి తన బ్యాచ్ ఆఫీసర్ అని గుర్తించి ఆశ్చర్యపోయారు.
1999 బ్యాచ్ పోలీసు అధికారి. అతను ఎస్సై గా పలు పోలీసు స్టేషన్లలో పనిచేశారు. 2005లో చివరిగా దతియాలో పనిచేశారు. తరువాతి కాలంలో అతని మానసిక పరిస్థితి దిగజారింది. ఇంట్లోని వారు అతనికి చికిత్స అందించారు. అయితే అ తరువాత మనీష్ మిశ్రా ఎటో వెల్లిపోయారు. ఇంట్లోని వారు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. అప్పటి నుంచి మనీష్ యాచకునిగా కాలం గడుపుతూ వస్తున్నాడు. ఈ కథనంతా తెలుసుకున్న డీఎస్పీ రత్నేష్ ఆ వ్యక్తిని ఒక స్వచ్ఛంద సంస్థ దగ్గరకు తరలించారు. అక్కడ మనీష్ మిశ్రా వైద్య చికిత్స కూడా పొందుతున్నాడు.