అతిపెద్ద మార్పు

‘ పేట’ చిత్రంలో సూపర్‌స్టార్‌తో త్రిష రొమాన్స్‌ చేయబోతోంది. ఈ నేపథ్యంలో త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో పెద్ద చర్చకు దారితీసింది. అందులో తన జుత్తును షార్ట్‌గా కట్‌ చేసుకుని త్రిష చాలా స్టైలిష్‌గా కనిపించింది. రజనీ చిత్రం కోసమే ఈ గెటఫ్‌ అని అంతా అనుకున్నారు. కానీ, త్రిష మాత్రం అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఒక అమ్మాయి తన జుత్తును కత్తిరించుకుందంటే ఆమె జీవితంలో పెద్ద మార్పును రాబోతున్నదని అంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. ఇంతకు ఆ పెద్ద మార్పు ఏమిటబ్బా అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు. త్రిష చిరకాల కోరిక అయిన రజనీకాంత్‌తో జత కట్టడం సారమైంది. ఇక, మిగిలింది పెళ్లే.. ఈ అమ్మడు పెళ్లికి రెడీ అవుతోందా? అన్న సందేహం మొదలైంది. ఈ క్రమంలో త్రిషకు పెళ్లి అంటూ మళ్లీ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com