అరికాలు మంటలా?

లక్షణాలు…

🌴వయసు పెరిగిన పెద్దవాళ్ళు తమకు అరికాళ్ళు మంటలు పుడుతున్నాయి అని అంటుంటారు.

🌱దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.
కాళ్ళల్లో పగుళ్ళు ఏర్పడటం వల్ల అరికాళ్ళు చర్మం పొరలుగా ఊడిపోవడం,

☘నరాల బలహీనత వంటి అనేక కారణాలు ఉంటాయి.

చిట్కాలు…

🍃అరస్పూను సాంబ్రాణి, కొద్దిగా గవ్వపలుకు తీసుకుని దాన్ని యాభై గ్రాముల నువ్వుల నూనెలో వేసి బాగా కాచి,

🍀చల్లార్చి ప్రతిరోజూ మూడుపూటలా అరికాలిమీద రాస్తూంటే అరికాలి మంటలు తగ్గుతాయి.

🌾మర్రిచెట్టు బెరడు మీద చాకుతో గాలు పెడితే పాలు కారతా యి.

🌿వీటిని ఒక చిన్న గ్లాసులో పట్టి ప్రతిరోజూ మూడు పూటలా అరికాళ్ళకు రాస్తూంటే అరికాలి మంటలు తగ్గిపోతాయి.

🌴గోరువెచ్చని నీటిలో అరికాళ్ళను ఉంచితే పావుగంటలో అరికాళ్ళ మంగలు తగ్గుతాయి.

🍂 ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.

🌻మునగ చెట్టు బెరడును గంధంగా తీసి అరికాళ్ళ మీద రోజుకు మూడు పూటలా రాసుకోవాలి.

⚡రెండు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూను నిమ్మగడ్డి నూనెలో కలిపి రోజూ మూడుపూటలా మర్దనా చేసుకోవాలి.

🔥మల్లె ఆకుల రసంగాని, మందార ఆకుల రసంగాని ప్రతిరోజూ రాత్రిపూట మర్దనా చేయాలి.

🍀అల్లాన్ని మెత్తగా నూరి గుజ్జుగా చేసుకుని దాన్ని అరికాళ్ళకు ప్రతిరోజూ మర్దనా చేసుకుంటుంటే అరికాళ్ళ చర్మపు పొరలు ఊడటం తగ్గిపోతాయి.

🌿దాల్చిన చెక్కను నీటిలో నూరి దాన్ని అరికాళ్ళ మీద రోజుకు మూడు సార్లు రాసుకోవాలి.

🍋నిమ్మకాయ చెక్కతో అరికాళ్ళ మంట ఉన్నచోట రాసినా మంటలు తగ్గుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com