ఏపీ ప్రవాసుల ఫిర్యాదుల పరిష్కార విభాగం

ప్రవాసాంధ్రుల సమస్యల సత్వర పరిష్కారం, పారిశ్రామిక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ-పెట్టుబడులకు అనుకూల వాతావరణం, రక్షణ కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగం సరికొత్త చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం కొత్తగా ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదుల పరిష్కార విభాగం (ఏపీ ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్‌ రీడ్రెసెల్‌ సెల్‌), ఏపీ పెట్టుబడులు భద్రత పరిరక్షణ (ఏపీ ఇన్వెస్టెమెంట్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ సెల్‌) విభాగాలను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ బుధవారం వీటిని ప్రారంభించారు. వాటి ముఖ్య ఉద్ధేశ్యాలను వివరించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్‌.అనూరాధ, సీఐడీ విభాగాధిపతి అమిత్‌ గార్గ్‌, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవి, ఏపీ జన్మభూమి కమిటీ సభ్యుడు పైల ప్రసాదరావు తదితరులతో కలిసి ఈ విభాగాల వివరాలతో కూడిన కరదీపికను ఆవిష్కరించారు.
1. ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదుల పరిష్కార విభాగం
ఉద్దేశం
*ప్రవాసాంధ్రుల సమస్యల (పోలీసు శాఖ పరిధిలోకి వచ్చేవి)కు సత్వర పరిష్కారం
* వారు ఏపీకి రానవసరం లేకుండానే తామున్న దేశంనుంచి ఫిర్యాదు చేసినా..అవసరమైన చర్యలు చేపట్టడం
ఏయే అంశాలపై ఫిర్యాదు
* గృహహింస, వరకట్న వేధింపులు, మోసం, ఫోర్జరీ, వంచన, నమ్మక ద్రోహం విభాగ స్వరూపం
* మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు.
* ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం పనితీరు-సమన్వయం
* తమకొచ్చే ఫిర్యాదులపై సీఐడీ లేదా స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ చేపడతారు. అందులోని అంశాల ఆధారంగా కేసు నమోదు చేస్తారు. అవసరమైతే కేసు దర్యాప్తు బాధ్యతలు ఈ విభాగమే చూస్తుంది.
* ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులతో పాటు…వారిపైన వచ్చే ఫిర్యాదులనూ స్వీకరిస్తారు. గడువులో పరిష్కరిస్తారు.
******సలహా మండలి
*డీజీపీ అధ్యక్షతన సలహా మండలి. నిఘా, సీఐడీ విభాగం అదనపు డీజీపీలు, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ప్రతినిధులు, పారిశ్రామిక ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ప్రతిపాదనలు చేస్తుంది.
***ఫిర్యాదు ఎలా?
*మెయిల్‌ ఐడీ: apnrigcell.cid@gmail.com
* వాట్సాప్‌: 9440700830
* 24/7 కాల్‌ సెంటర్‌ (టోల్‌ ఫ్రీ నెంబర్‌): 1800 300 26234
2. ఏపీ పెట్టుబడుల భద్రత-పరిరక్షణ విభాగం
ఉద్దేశం
* పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టే పెట్టుబడులకు, ఏర్పాటు చేసే వ్యవస్థలకు అవసరమైన రక్షణ కల్పించడం
* విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల ఫిర్యాదులపై సత్వరం స్పందించడం.
***ఏయే అంశాలపై ఫిర్యాదంటే..
* సంస్థ ఆస్తుల ఆక్రమణ, కర్మాగార రక్షణ, పరిశ్రమల స్థాపన, నిర్వహణలో, భద్రత అంశాల విషయంలో శాంతిభద్రతలకు సంబంధించిన వాటిపై..
**విభాగ స్వరూపం
* ఏపీ సీఐడీలో అంతర్భాగంగా ఉంటుంది.
* ఎస్పీస్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు.
**పనితీరు-సమన్వయం
* పారిశ్రామిక ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో గస్తీ పెంచుతారు. అవసరమైతే పోలీసు అవుట్‌ పోస్టులు ఏర్పాటు
* ఆయా పరిశ్రమల్లో పనిచేసే విదేశీ యులకు సంబంధించి వీసా సమస్యలను పరిష్కరిస్తారు.
***సలహా మండలి
* డీజీపీ అధ్యక్షతన సలహా మండలి.
* ఐటీ, ఫార్మా రంగాల పరిశ్రమల ప్రతినిధులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య సమాఖ్య, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
* ప్రతి 3 నెలలకోసారి సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేస్తుంది.
**ఫిర్యాదు ఎలా?
*మెయిల్‌ ఐడీ: cid@gmail.com
* వాట్సాప్‌ నెంబర్‌: 9440700830
* 24/7 కాల్‌ సెంటర్‌ (టోల్‌ ఫ్రీ నెంబర్‌): 1800 300 26234

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com