Health

శీతకాలం శృంగారం సర్వం ఆరోగ్యవంతం

శీతకాలం శృంగారం సర్వం ఆరోగ్యవంతం

శృంగారమంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే, కలయికను ఆస్వాదించాలని కోరుకుంటే సరిపోదు. దానికి తగినట్లుగా వాతావరణం కూడా ఉండాలి. అప్పుడే అందులో మరింత కిక్కు పెరుగుతుంది. చలికాలంలో సెక్స్ కోరికలు తెలియకుండానే పెరిగిపోతాయి. చల్లని వాతావరణం వెచ్చని కోరికలను రగిలించడం వల్ల జంటలు దగ్గరవుతారు. మరి, చలికాలం సెక్స్‌కు మంచిదేనా? సంతానం కోసం ప్రయత్నించేవారికి ఈ సీజన్ మంచిదేనా?

సీజన్‌కు అనుగుణంగా సెక్స్‌ కోరికలు కూడా మారుతుంటాయని నిపుణులు తేల్చారు. చలికాలమంటే కోరికలు రగిలించే కాలమని అంటారు. ఈ సమయంలోనే పురుషుల్లో ఎక్కువ సెక్స్ కోరికలు కలుగుతాయట. మిగతా కాలాల్లో కంటే చలికాలంలోనే ఎక్కువగా సెక్స్ కోసం పరితపిస్తుంటారట. నిజం చెప్పాలంటే సెక్స్‌కు అనువైన కాలంగా శీతాకాలాన్ని పేర్కోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. చాలా దేశాల్లో చలికాలానికి కొన్ని నెలల ముందు లేదా వర్షాకాలంలో జంటలకు పెళ్లిళ్లు చేస్తారట. దీనివల్ల వారు సెక్స్‌లో పాల్గొని త్వరగా పిల్లలను కంటారని వారి భావన. పైగా, సైక్స్ లైఫ్ బాగుంటే.. దాంపత్య జీవితం కూడా బాగుంటుందని ఆశిస్తారు. చలికాలంలో సెక్స్‌ చేయడం వల్ల వివిధ జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చని వారు సెలవిస్తున్నారు. సెక్స్ మంచి వ్యాక్సిన్‌లా పనిచేస్తోందట. చలికాలంలో సెక్స్‌ చేయడం వల్ల సెక్స్ చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయమం లభించడమే కాకుండా.. జలుబు, ఫ్లూ వంటి వైరస్‌లను తట్టుకునే రోగనిరోధకశక్తి పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు. అదేవిధంగా ఈ కాలంలో సెక్స్‌ చేయడం వల్ల మహిళలు రుతుస్రావ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట.

*** చలికాలంలోనే ఎందుకు? :
చలికాలంలో సెక్స్‌ కోరికలు కలుగడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో వేడి ఉష్ణోగ్రత, ఉక్కపోత, చెమట కంపు కారణంగా జంటలు దగ్గరయ్యేందుకు ఇష్టపడరు. శరీరాల రాపిడి వల్ల చెమట, చికాకు పెరగడమే ఇందుకు కారణం. అయితే, చలికాలంలో శరీరాలు వెచ్చదనాన్ని కోరుకుంటాయి. సెక్స్ చేస్తుండగా శరీరంలో పుట్టే వేడి చికాకుకు బదులు ఎంతో హాయిని కలిగిస్తుంది. ఇటీవల సంతాన సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. చాలామంది పిల్లల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమవుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్లే పురుషుల్లో సంతాన లేమి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. ఇందుకు మారుతున్న జీవనశైలి కూడా ముఖ్య కారణమని వారు చెప్తున్నారు.

*** మహిళలకు మంచిదే:
మిగతా సీజన్లతో పోల్చితే శీతాకాలం మహిళలకు మంచే చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ నెలల్లో మహిళల్లో రుతుక్రమ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయట. అందుకని వీరు ఈ సీజన్లో పడక గదిలో పార్టనర్‌కు గట్టి పోటీయే ఇస్తారట. ఓ సర్వేలో తేలిన సమాచారం ప్రకారం.. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల మహిళల్లో రుతు సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

*** బిగుతుగా కప్పేయొద్దు!
అయితే, చలివేస్తుందనే కారణంతో పురుషులు వృషణాలను బిగువైన వస్త్రాలతో కప్పేసి.. అక్కడ ఎక్కువ వేడిని పుట్టించేలా చూడొద్దు. అది సంతాన సమస్యలను సృష్టించవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో టెస్టోస్టెరాన్ (వృషణాల స్రావం) ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో సంతానం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. సో.. గుడ్‌ లక్!