అమరావతి రాదారులపై విద్యుత్ బస్సులు

ఏపీ రాజధాని రోడ్లపై తోలి ఎలక్ట్రిక్ బస్సు.

రాజధానిలోని రోడ్లపై తొలి ఎలక్ట్రిక్‌ బస్సు పరుగులు తీసింది.

గన్నవరం నుంచి తుళ్లూరు వరకు ఈ-బస్సును ప్రయోగాత్మకంగా నడిపారు.

డ్రైవర్‌ కాకుండా 39 మంది కూర్చునేందుకు వీలున్న ఈ బస్సులో ఆర్టీసీ నడుపుతున్న గరుడలో ఉన్న సౌకర్యాలన్నీ ఉన్నాయి.

సుమారు 3 గంటలపాటు చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా పరుగులు తీయగల సత్తా ఈ-బస్సు సొంతం.

ఈ బస్సును మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సంస్థ సిబ్బంది కోసం అందుబాటులో ఉంచారు.

కాలుష్య రహిత బస్సులు కావడంతో వీటి కొనుగోలుపై పలు రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి- తిరుమల నడుమ కూడా ఈ-బస్సును నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.

రాజధాని ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఈ-బస్సుల వాడకాన్ని పెంచే దిశగా సీఎం చర్యలు చేపడుతున్నారు.

బుధవారం గన్నవరం ఆర్టీఏ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com