యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్’ వీసాలకు అర్హుల జాబితాను మరింతగా విస్తరించారు. యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్దూమ్ ఆదివారం ఈ వివరాలు వెల్లడించారు. ఎంపికచేసిన వృత్తి నిపుణులకు ఇస్తున్న ఈ గోల్డెన్ వీసాతో అక్కడ పదేళ్ల పాటు కుటుంబంతో సహా నివాసం ఉండొచ్చు. ప్రస్తుతం పెట్టుబడిదారులు, టెక్ నిపుణులు, వైద్యులు, ప్రత్యేక డిగ్రీలున్న విద్యార్థులు, ఇతరత్రా రంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి వీటిని ఇస్తున్నారు. తాజాగా అన్నిరకాల పీహెచ్‌డీలు ఉన్నవారు, వైద్యులు, బయోటెక్నాలజీ నిపుణులు, కంప్యూటర్ ఇంజినీర్లు(ఎలక్ట్రానిక్స్, ప్రోగామింగ్, ఎలక్ట్రిసిటీ), యూఏఈ యూనివర్సిటీల్లో కనీసం 3.8 జీపీఏ సాధించిన వారికి ఈ అవకాశం ఇచ్చారు. అలాగే కృత్రిమ మేథ, బిగ్ డేటా, వైరాలజీలో పట్టభద్రులు, హైస్కూల్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. అయితే వీరంతా యూఏఈలోనే తమ కుటుంబాలతో సహా ఉంటుండాలి. డిసెంబరు 1 నుంచి ఈ వీసా విధానం అమలవుతుంది.
UAE వీసాలపై “గోల్డెన్” ఆఫర్
Related tags :