జయలలితకు భారతరత్న కావాలి

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రులు సీఎన్‌ అన్నాదురై, జయలలితలకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధానిని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కోరారు. ఈ మేరకు బుధవారం నరేంద్ర మోదీకి వేర్వేరుగా లేఖలు రాశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తీర్మానాల మేరకు ఈ లేఖలు రాశారు. అన్నాదురై సిద్ధాంతాలే ఇతర ద్రావిడ పార్టీలకు ఆదర్శమయ్యాయని, ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ద్రావిడ ఉద్యమాలతోపాటు అనేక పథకాలతో తమిళుల సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. జయలలిత కూడా రాష్ట్రంలో రాజకీయ నేతగా ఎనలేని సేవలందించారని తెలిపారు. ప్రజా నాయకురాలిగా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారన్నారు. భారతరత్న పురస్కారం ఇవ్వడమే ఆ గొప్ప నేతలకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు డాక్టర్‌ ఎంజీఆర్‌ పేరు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com