డాలర్ దూకుడుతో పతనమవుతున్న తెలుగు మధ్య తరగతి కుటుంబాలు–TNI ప్రత్యేకం

గత నెలరోజుల నుండి అమెరికా డాలరు పైపైకి పరుగులు పెడుతోంది. రూపాయి గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీనిస్తోంది. దీంతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మన తెలుగు విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న చాలా మంది మధ్య తరగతి రైతులు తమ పిల్లలను ఉన్నత చదువులకోసం అమెరికా పంపించారు. చాలా మంది తమకున్న ఆస్తులను అమ్ముకుని పిల్లలకు మంచి భవిష్యతు ఉంటుందనే ఆశతో అమెరికాకు పంపించారు. చాలా మంది స్థానిక బ్యాంకుల నుండి లక్షలాది రూపాయలు పిల్లల చదువులకోసం అప్పులు చేశారు. మరికొంత మంది వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకున్నారు. డాలర్ రేటు పెరగడంతో ఊహించని విధంగా ఖర్చులు పెరిగి విద్యార్ధుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
***అటు చదువు పూర్తీ అయిన విద్యార్దుల్లోనూ ఆందోళన
అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ (ఎమ్మెస్)పూర్తీ చేసిన వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులు నెలలు తరబడి ఖాళీగా అమెరికాలోనే ఉంటున్నారు. వీరిలో చాలామందికి తల్లిదండ్రులే డబ్బులు పంపుతున్నారు. కొందరు కన్సల్టెంట్లు వద్ద ఆశ్రయం పొందుతున్నారు. కొందరు కన్సల్టెంట్లు ఎక్కువ కాలం తమ అతిధి గృహాలలో నిరుద్యోగులును పోషించలేక బయటకు పంపివేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అమెరికాలో ఖాళీగా ఉన్న తమ పిల్లలను పోషించవలసిన బాద్యత తల్లిదండ్రుల మీదే పడింది.
****అటు ట్రంప్ భయం.. ఇటు డాలరు దెబ్బ
అమెరికాలో అద్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు మన తెలుగు జాతిపై చాలా ప్రభావం చూపుతుంది. హెచ్ 1బీ వీసాలు మంజూరు కాక కొందరు, పునరుద్దరణ కాక, మరి కొందరు తల్లడిల్లుతున్నారు. నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే తెలుగువారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ పరిష్టితుల్లో భారతదేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాల మూలంగా రూపాయి పతనమవుతోంది. వెలాది కుటుంబాల పై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. తక్షణమే రూపాయి గతంలో లాగా బలపడే విధంగా చర్యలు చేపట్టాలని అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. – కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com