వారెవ్వా! ఏమి సెలవిచ్చినవయ్యా అచ్చెన్నాయుడు?

బాబ్లీ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుకు వచ్చిన వారెంట్‌ తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌గా భావిస్తున్నానని పేర్కొన్నారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందని చంద్రబాబు రైతుల పక్షాన వెళ్లారన్నారు. 2007లో దేవేందర్‌గౌడ్‌ నాయకత్వంలో తాను కూడా వెళ్లానన్న మంత్రి.. మాకు ఇవ్వని నోటీసులు ముఖ్యమంత్రికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఈనెల 23న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లనున్న సీఎంను అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగడగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల కక్ష లేదంటే ఎవరు నమ్ముతారన్న మంత్రి… ఎటువంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు తెదేపా సిద్ధంగా ఉందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com