మే24 నుండి ఇర్వింగ్‌లో నాట్స్ సంబరాలు


ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 6వ ద్వైవార్షిక సంబరాలకు టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగరం ముస్తాబు కానుంది. మే 24, 25, 26 తేదీల్లో ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాలను నిర్వహించటానికి కార్యవర్గం ఆమోదం తెలిపినట్లు నాట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు డల్లాస్ నాట్స్ విభాగంతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సంబరాల చైర్మన్‌గా కంచర్ల కిషోర్ వ్యవహరిస్తారని వారు తెలిపారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను ప్రతిబింబించే పలు ఆసక్తికర, ఉత్సాహవంతమైన కార్యక్రమాలను ఈ సంబరాల్లో పొందుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నాట్స్ తెలిపింది.
nats irving 2019 america telugu sambaralu

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com