మూడో చిత్రంలో

సైఫ్ అలీఖాన్ ముద్దుల తనయ సారా అలీఖాన్ ‘కేదార్నాథ్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే రణ్‌వీర్‌సింగ్ తో ‘సింబా’లో నటించే అవకాశం దక్కించుకొంది. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాకుండానే మరో ఛాన్స్ కొట్టేసింది సారా. వరుణ్‌ధావన్ తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘మైనే తేరా హీరో’, ‘జుద్వా 2’ చిత్రాలు విజయం సాధించాయి. డేవిడ్‌ధావన్ ‘నెం.1’ సిరీస్ చిత్రాల్లో భాగంగా ఈ కొత్త చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి వరుణ్ సోదరుడు రోహిత్ ధావన్ నిర్మాత. సారా నటించిన ‘కేదార్నాథ్’ నవంబరులో విడుదల కానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com