తిరుమలకు మార్గం రూపొందించిన మోక్షగుండం-ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకం

భారతదేశం గర్వించదగ్గ ఇంజినీరు…. మేధతోనే దేశ అత్యుత్తమ పురస్కారం సాధించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు తిరుమల కొండ ఎక్కే ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. సులభంగా, వేగంగా స్వామి వారి సన్నిధికి భక్తులు వెళ్లగలుగుతున్నారంటే.. అది మోక్షగుండం ప్రతిభకు నిదర్శనమే. తిరుమలకు మొదటి ఘాట్‌రోడ్డును డిజైన్‌ చేసిన వ్యక్తి మోక్షగుండమే.
* 1944లో మొదటి ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఏప్రిల్‌ 10, 1944లో మద్రాసు ప్రావెన్సీ గవర్నరు ఆర్థర్‌ హోప్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ శిలాఫలకం ఇప్పటికీ గరుడ సర్కిల్‌ సమీపంలో ఉంది.
* తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారి మొదటి ఘాట్‌ రోడ్డు అని చాలామంది అనుకుంటారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మార్గమే మొదటి మార్గం. అదే విశ్వేశ్వరయ్య ఆలోచనల కలల రూపం. అప్పట్లో మైసూరు సంస్థానం ఇంజినీరుగా సేవలందిస్తున్న ఆయనకు బ్రిటీషు ప్రభుత్వం తిరుమల ఘాట్‌రోడ్డు పనులను అప్పగించింది.
* తర్వాత కాలంలో రద్దీ ఎక్కువ కావడం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 1974లో తిరుపతి నుంచి తిరుమలకు మరో ఘాట్‌రోడ్డును నిర్మించారు.
* నాలుగు సంవత్సరాలకు పైగానే మోక్షగుండం శేషాచలాన్ని పరిశీలన చేసి… మొదటి ఘాట్‌ను నిర్మించారు. గతంలో కేవలం డోలీలు తిరిగే కీకరణ్యాన్ని ఛేదించి ఆయన వేసిన రోడ్డు నేటికీ అలాగే ఉంది.
* మొదట ఎద్దుల బండ్లు వెళ్లేలా మార్గాన్ని నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత చిన్న వాహనాలు ఘాట్‌రోడ్డులోకి ప్రవేశించాయి.
* రోడ్డును క్రమక్రమంగా వెడల్పు చేయడం… రోడ్డుకు ఇరువైపులా గోడలు కట్టించడం… అందమైన రోడ్లను నిర్మించడం తర్వాత జరిగాయి. మొదట్లో అత్యంత చీకటిగా, భయానకంగా రహదారి కనిపించేది.
* మొదటి ఘాట్‌ రోడ్డు పొడవు : 18 కిమీ
* మలుపులు : 52
* తిరుపతికి చేరుకునేందుకు పట్టే సమయం : 45 నిమిషాలు
* ఘాట్‌లో చూడాల్సిన ప్రదేశాలు : జింకల పార్కు, మోకలిమెట్టు, ఏడో మైలు అభయాంజనేయస్వామి విగ్రహం, లక్ష్మినరసింహస్వామి ఆలయం, అక్కగార్ల దేవాలయం, మల్వాడిగుండం జలపాతం(వర్షాకాలంలో), సహజ శిలా గరుడ రూపం, గణపతి ఆలయం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com