నోకియా9. కెమెరాలు5.

హెచ్‌ఎండీ గ్లోబల్‌ త్వరలో తీసుకురాబోయే ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ టెక్‌ప్రియుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య లీక్‌ అయ్యి వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోలు పలు సోషల్‌మీడియాల్లో దర్శనమిచ్చాయి. తాజా ఫొటోలతో ఈ ఫోన్‌కు అతిపెద్ద బ్యాటరీతో పాటు వెనుకవైపు పెంటా-లెన్స్‌(ఐదు లెన్స్‌లు) కెమెరా సెటప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ఓ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ఫొటోలు కన్పించాయి. నోకియాపవర్‌యూజర్‌ వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఫోన్‌కు వెనుకవైపు ఐదు లెన్స్‌ల కెమెరా సెటప్‌ ఉంది. అంతేగాక.. ఈ ఫోన్‌లో 4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఫొటోల్లో ఫోన్‌ నీలం రంగులో ఉంది. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజానికైతే ఇప్పటికే ఈ ఫోన్‌ను విడుదల చేయాల్సి ఉండగా.. పెంటా లెన్స్ కెమెరా వల్లే ఆలస్యమైందట. ఇక ఈ ఫోన్‌లో ముందువైపు మూడు కెమెరాలుండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగైతే నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు అవుతుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా 9 ‘ఆండ్రాయిడ్‌ పై’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అంతేగాక.. ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 6.01 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయట. మరి ఈ విషయాలపై స్పష్టత రావాలంటే ఫోన్‌ విడుదలయ్యేదాకా ఎదురుచూడాల్సిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com