ఆధునిక మానవుడు ఎంతటి విజ్ఞానాన్ని సముపార్జించినా.. ఎన్నెన్ని నూతన శిఖరాలను అధిరోహించినా.. అతనిలో ఇంకా నాటి ఆదిమ మానవుడి ఆనవాళ్లు, మూఢనమ్మకాలు పోలేదన్న కఠోర వాస్తవాన్ని… ఉత్తర్‌పద్రేశ్‌లోని భద్రాస్‌లో జరిగిన అత్యంత అమానవీయ ఘటన తేటతెల్లం చేసింది. ముక్కుపచ్చలారని బాలిక శరీర అవయవాలను తింటే.. సంతాన యోగం కలుగుతుందన్న ఒకే ఒక నమ్మకం.. ఓ ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి.. ఆపై పాశవిక హత్యకు… ఆ తర్వాత ఆమె అవయవాల వెలికితీతకు కారణమైంది. సంతానం కలగని దంపతులు ఆ చిన్నారి అవయవాల్ని తిన్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ అమానవీయ ఘటన దీపావళి పర్వదినాన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై నిందితులు సామూహిక అత్యాచారం చేసి.. చంపడమే కాకుండా.. అత్యంత అమానవీయంగా శరీరంలోని ఒకొక్క అవయవాన్ని కత్తితో కోసి బయటికి తీశారు. ఆ అవయవాల్ని తింటే సంతానం కలుగుతుందన్న మూఢ నమ్మకంతో ఉన్న ఓ నిందితుడి మావ, అత్త కలిసి వాటిని తిన్నారు. అవయవాలు తిన్న ప్రధాన కుట్రదారుడు పరశురామ్, అతని భార్య సునయనను, బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపిన అంకుల్ (20), బీరమ్(31)లను పోలీసులు అరెస్టుచేశారు.
ఏడేళ్ల పాపపై అత్యాచారం హత్య. గుండె తీసి తిన్నారు
Related tags :