రేవంత్ ఇబ్బంది అని కేసీఆర్ మోడీకి చెప్పారంట!

కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు తనకు అప్పగిస్తే ఇబ్బందని తెరాస కేంద్రానికి లేఖ రాసినట్లు తెలంగాణ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. అందుకే తనకు పదవులు రాకముందే అరెస్టుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. ప్రణాళికాబద్ధంగానే తన చుట్టూ, తన బంధువుల చుట్టూ తెరాస ప్రభుత్వం నిఘా పెట్టిందని రేవంత్‌ మీడియాతో అన్నారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏం జరిగినా కేసీఆర్‌, డీజీపీ, నిఘా ఐజీ ప్రభాకర్‌ రావుదే బాధ్యత అని హెచ్చరించారు. కేంద్ర సంస్థలతో తనపై దాడులు జరుపుతామని తెరాసకు భాజపా హామీ ఇచ్చినట్లు తన వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కమిటీ ప్రకటనలకు ముందే తనపై కేసులు పెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఈడీని పంపినా.. వంద అక్రమ కేసులు పెట్టినా వదిలేది లేదన్నారు. తనపై పెట్టిన ఓటుకు నోటు అక్రమ కేసు తప్పుడు కేసు అని గతంలోనే హైకోర్టు చెప్పిందన్నారు. జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌తో పాటు తనపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హరగోపాల్‌, చుక్కా రామయ్య, విమలక్క సహా ప్రశ్నించే ఎవ్వరినీ తెరాస ప్రభుత్వం వదలడం లేదని విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com