ఈ రైలు అచ్చంగా గాలి మీదే నడుస్తుంది

ఆ రైలును సరదాగా గాలిమోటరు అని పిలవొచ్చు.

ఎందుకంటే అది అచ్చంగా గాలిమీద నడుస్తుంది. గాలి అంటే హైడ్రోజెన్.

ఇక దానినుంచి పొగలుసెగలూ రావు. కాలుష్యం బాధే ఉండదు.

మహాఅయితే కొంత ఆవిరి లేదా నీటి చుక్కలు బయటకు వస్తాయి.

వాతావరణంలో కార్బన్ శాతం పెరగడానికి డీజిల్ వాహనాలు ప్రధాన కారణం.

కానీ జర్మనీలోని అల్‌స్టోమ్ కంపెన తయారుచేసిన ఈ అధునాతనమైన రైలు కాలుష్యానికి చెక్ పెడుతుంది.

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీని ఖరీదు మాత్రం ప్రస్తుతం కొంచెం ఎక్కువే ఉంది.

ఒక్కో రైలు ఖరీదు భారతీయ కరెన్సీలో రు.49 కోట్లు.

అయితేనేం డీజిల్ బండ్లతో పోలిస్తే కాలుష్యం లేకపోవడమే కాదు నిర్వహణా ఖర్చూ తక్కువే కావడం వల్ల జర్మనీలోని పలు సంస్థలు ఈ రైళ్లను కోరుకుంటున్నాయి.

ఈ రైళ్లు హైడ్రోజెన్ శక్తి మీద నడుస్తాయి. మొబైల్ ఫోన్లలో, అనేక గృహోపకరమాల్లో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఇందులో ఉంటాయి.

హైడ్రజెన్-ఆక్సిజన్‌తో కలవడం వల్ల పుట్టే శక్తి బ్యాటరీల్లో నిల్వ అవుతుంది.

ఆ శక్తి రైలు నడిచేందుకు ఉపయోగిస్తారు. ఆ రెండు వాయువులు కలిస్తే నీరు ఏర్పడుతుంది. అదే ఎగ్జాస్ట్ లోనుంచి బయటకు వస్తుంది.

అంటే రైలు వదిలేది నీరు లేదా ఆవిరిని మాత్రమే. కార్బన్ డయాక్సైడ్ అసలు విడుదల కానేకాదు. అదే దీని ప్రత్యేకత.

అల్‌స్టోమ్ కంపెనీ ఈ రైళ్లకు కొరాడియా ఐలింట్ ట్రైన్స్ అని పేరుపెట్టింది.

ఒకసారి హైడ్రోజెన్ ట్యాంక్ నింపితే రైలు వెయ్యి కిలోమీటర్ల దాకా నడుస్తుందని అంటున్నారు.

ఒకవేళ అదనంగా విద్యుత్తు ఉత్పత్తి అయినా అది బ్యాటరీల్లోనే నిల్వ ఉంటుంది.

రైలును గత ఆదివారం పట్టాలెక్కించారు. ఇలాంటివి త్వరలో 14 రైళ్ల వరకు ప్రవేశపెట్టనున్నట్టు జర్మనీ అధికారులు వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com