ప్రవాసులు ఆన్‌లైన్ ఒటు కోసం ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

ఓటరుగా నమోదు.. అక్కడి నుంచే ఓటు.. విదేశీ పౌరసత్వం లేకపోతే చాలుఅవగాహన లేక నమోదుకు దూరంఇప్పటికి నమోదైంది కేవలం నలుగురేప్రచారం కల్పిస్తే లక్షల్లో కొత్త ఓటర్లుఅందరూ నమోదైతే కొన్ని చోట్ల కీలకం!
మీరు భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారా? వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నారా? మీ ప్రాంతంలో ఓటేయలేకపోతున్నామన్న చింత వద్దు. మీరున్న చోట నుంచే ఓటు వేయవచ్చు. విదేశాల్లో ఉంటూనే ఓటు హక్కును పొంది.. మీ ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో ఆన్లైన్లో ఓటు వేయవచ్చు.
*** విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల (ఎన్నారైల)కు కూడా భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటు హక్కు కల్పించింది. కానీ, దీనిపై ప్రచారం, అవగాహన కొరవడటంతో వారంతా ఓటరుగా నమోదు కావడంలేదు. ఇప్పటికే స్వస్థలంలో ఓటు హక్కు కలిగి ఉన్నా కూడా విదేశాల్లో ఉన్నందున.. ఓటును బదిలీ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. దీంతో లక్షలాది మంది విదేశాల్లో ఉంటున్న కారణంగానే స్వదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రవాస భారతీయులు ఓటు హక్కును పొందడం లేదని చెప్పడానికి ఇప్పటివరకు నమోదైన ఓటర్లే నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య సింగిల్ నెంబర్ డిజిట్లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నారైలది ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. రాష్ట్రంలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో విదేశాల్లో ఉండి.. ఓటర్లుగా నమోదైనవారు కేవలం నలుగురే ఉన్నారు. ఇందులో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరిలో ఇద్దరు రంగారెడ్డి జిల్లా వాసులు కాగా, ఒకరు పెద్దపల్లి, మరొకరు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు.
***అవగాహన లోపమే కారణం..
ప్రవాస భారతీయులు కూడా ఓటరుగా నమోదు కావచ్చునని, ఓటింగ్లో పాల్గొనవచ్చుననే విషయంలో అవగాహన లోపం కారణంగానే నమోదు తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలంగాణవాసులు లక్షల్లోనే ఉంటారు. వీరిలో అవగాహన పెరిగితే… లక్షల్లో కొత్త ఓటర్లు నమోదవుతారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నవారు ఆ దేశ పౌరసత్వం పొంది ఉండకపోతే.. స్వదేశంలో ఓటుహక్కు పొందవచ్చు. పాస్ట్పోర్టు, వీసా, తమ స్వస్థలానికి సంబంధించిన ఆధారాలు ఆన్లైన్లోనే సమర్పించి, ఓటు హక్కు పొందవచ్చు. ఆన్లైన్లో ఫారం-6ఎ నింపితే అర్హతలు పరిశీలించి ఓటుహక్కు కల్పిస్తారు. కాగా, ఈ అవకాశాన్ని వారం రోజులుగా 19 మంది మాత్రమే వినియోగించుకున్నారని, వీరిలో కొందరికి ఇప్పటికే ఓటుహక్కు కల్పించామని అధికారులు చెబుతున్నారు.
***ఎన్నారై ఓట్లు కొన్ని చోట్ల కీలకం
ఎన్నారైలు అందరూ ఓటర్లుగా నమోదై.. ఆన్లైన్లో ఓటింగ్లో పాల్గొంటే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలు కీలకంగా మారతాయని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి వేలాది కుటుంబాలు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ర్టోరల్ స్పెషల్ సమ్మరీ రివిజన్లో ప్రవాస తెలంగాణ వాసులంతా దరఖాస్తు చేసుకుంటే లక్షల్లో ఓటర్లు పెరగనున్నారు. ఈ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా మారనున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించి.. ఆన్లైన్ ద్వారా వారి ఓట్లను పొందడం కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
***చెప్పాలా? వద్దా?
తెలుగులో శ్రద్ధా కపూర్ నటిస్తున్న తొలి సినిమా ‘సాహో’. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను ఏకకాలంలో హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు! ఇందులో తన పాత్రకు తెలుగు డబ్బింగ్ తననే చెప్పమంటాం… వద్దంటారో!? అని శ్రద్ధా కపూర్ అన్నారు. హిందీలో ఎలాగో ఆమె డబ్బింగ్ చెబుతారు. తెలుగుకు వచ్చేసరికి దర్శకుడు సుజీత్దే తుది నిర్ణమని తెలిపారు. ఇంకా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ ‘‘షూటింగులో నా డైలాగులను తెలుగులో నేనే చెప్పుకుంటున్నా. తెలుగులో నాకు ప్రాంప్టింగ్ అవసరం లేదు. అయితే… తెలుగులో డబ్బింగ్ నేను చెప్పాలా? వద్దా? అనే విషయంలో దర్శకుడు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. కానీ, నేను తెలుగు మాట్లాడుతుంటే లోకల్ తెలుగు అమ్మాయిలా ఉందని చెప్పడంతో చాలా సంతోషించా’’ అని పేర్కొన్నారు.

ఈ- రిజిస్ట్రేషన్ విధానము ద్వారా ఆన్లైన్ లో వోట్ నమోదు కార్యక్రమంలో పాల్గొని ,మీ మీ నియోజక వర్గాలలో ఓటరుగా నమోదు చేసుకొనే అవకాశం ఈ నెల సెప్టెంబర్ 25 వరకు ఉందని, ప్రవాస తెలంగాణ బిడ్డలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం వలన రాబోయే ఎన్నికలలో ప్రత్యక్షంగా వోట్ వేసే అవకాశం వుండడంతో బాటు త్వరలో ప్రవేశ పెట్టబోతున్న ప్రాదేశిక ఓటింగుకు ఉపయోగపడుతుందని తెలిపారు మహేష్ బిగాల తెలిపారు . ఇప్పటివరకు వోట్ నమోదు చేసుకోనివారు, ఇండియన్ పాస్పోర్ట్ కలిగివుండి , భారత పౌరసత్వం వున్నా వాళ్ళందరూ ఈ ప్రక్రియకు అర్హులు అని తెలిపారు. ఈ క్రింద తెలిపిన ఫారం – 6A ను నింపి నమోదు చేసుకోవాల్సివుంటుంది.

https://eci.nic.in/eci_main/forms/Form-6A.pdf

తక్కువ సమయం ఉండడం వలన వివిధ దేశాల తెరాస- శాఖలు అధ్యక్షులకు మరియు సభ్యులకూ ఓటర్ నమోదు కార్యక్రమం పైన సూచనలు జారీ చేశామని , ఆలాగే అన్ని దేశాల తెరాస సభ్యులు ఇప్పటికే సోషల్ మీడియా లో సైనికుల లాగ పార్టీకి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారని , ఆలాగే విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొడుతున్నారని తెలిపారు. చాలామంది NRI సభ్యులు ఎన్నికల ప్రచారానికి వచ్చి పార్టీకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. కెసిఆర్ గారిని మల్లి సీఎం గా చూడడమే లక్యంగా తమ వంతు కృషి చెయ్యడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని మహేష్ బిగాలా తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com