Devotional

కాలభైరవుడి పటం ఇంట్లో పెట్టుకోవచ్చా?

Can you keep kalabhairava photo in home?

కాలభైరవుడి చిత్రం ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఎలాంటి దోషం లేదు. విగ్రహాన్నీ పూజగదిలో ఉంచి పూజించుకోవచ్చు. కాలభైరవుడిదనే కాదు.. ఇంట్లో ఉండే ఏ దేవతా విగ్రహాల పరిమాణమైనా నాలుగు అంగుళాలకు మించరాదు. విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరి. వాటికి నిత్య ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. నిష్ఠగా ఉండాలి. ఆచారాలు పాటించాలి. ఈ నియమాల ఆచరణలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే ఇంట్లో విగ్రహాలు వద్దని పెద్దలు సూచించారు.