NRI-NRT

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా

అమెరికాలో కరోనా మృతులు రికార్డు స్థాయిలో 2.5 లక్షలు దాటేశాయి.

జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం విశ్వవ్యాప్తంగా 13.49 లక్షల మందిని కరోనా బలిగొంటే వారిలో 2.5 లక్షల మంది అమెరికన్లే ఉండడం గమనార్హం.

ప్రతి నిమిషానికి ఒక అమెరికన్‌ కరోనా కాటుకు బలవుతున్నట్టు సీఎన్‌ఎన్‌ విశ్లేషించింది.

అమెరికాలో ఇప్పటివరకు 1.15 కోట్ల మందికి వైరస్‌ సోకింది.

‘బుధవారం ఒక్కరోజే 1,55,000 కేసులు బయటపడ్డాయి.

ప్రస్తుతం రోజుకి 1,700 మరణాలు నమోదవుతున్నాయి’ అని విశ్లేష కులు అన్నారు.

కరోనా రోగుల చేరిక అమాంతం పెరగడంతో ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. మంగళవారం 76,830 మంది ఆస్పత్రుల్లో చేరారు.

మరోవైపు ఆఫ్రికా ఖండంలో కరోనా కేసులు 20 లక్షల మార్కుని దాటేశాయి. 48 వేల మంది చనిపోయారు.

కాగా, అధికార బదలాయింపు ప్రక్రియ ఆలస్యం చేస్తున్న ట్రంప్‌ వల్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొచ్చే ప్రణాళికలు వారాలు లేదా నెలలపాటు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ హెచ్చరించారు.