ఆవులతో సంస్కృతం మాట్లాడిస్తా. ప్రయోగాలు చేస్తున్నాను.

రంజిత ‘సెక్స్ టేప్’ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న స్వయం ప్రకటిత దేవదూత స్వామి నిత్యానంద గుర్తుండే ఉంటారు.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జంతువుల చేత కూడా తమిళం, సంస్కృతం మాట్లాడించగలనని చెప్పి పెద్ద చర్చకు తెర లేపారు.

ఆయన తయారు చేసే ఓ సాఫ్ట్‌వేర్ ద్వారా జంతువులతో మాట్లాడించడగలనని అంటున్నారు.

ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉందని, కొంత వరకు ప్రయోగాత్మకంగా విజయవంతమైనప్పటికీ, ఇంకా కొంత మేరకు కష్టపడాల్సి ఉందని అన్నారు.

తన మాటలను కొట్టిపారేయడానికి వీళ్లేదని, సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ ప్రయోగం చేసి చూపించగలనని, అవసరమైతే తన వ్యాఖ్యల్ని రికార్డు చేసుకోండని అన్నారు.

‘కోతులతో పాటు మరికొన్ని ఇతర జంతువులకు అన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ లేవు.

వాటికి సూపర్‌ కాన్సియోస్ పురోగగతిని అందించినట్లైతే వాటిల్లో ఆయా ఆర్గాన్స్ వృద్ధి చెందుతాయి.

శాస్త్రీయ, వైద్య విధానంలో త్వరలోనే దీన్ని చేసి చూపిస్తాను.

ఇది కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే ఆవులు, ఎద్దులు తమిళం, సంస్కృతం మాట్లాడతాయి’’ అని నిత్యానంద అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com