మరక మంచిదే లాగా…

‘మరక మంచిదే’ అన్నట్టు ‘కోపం కూడా మంచిదే’ అంటోంది కాజల్. సాధారణంగా ‘తన కోపమే తన శత్రువు’ అనే మాటలు వింటుంటాం. కాజల్ మాత్రం ఆ కొటేషన్ని కొత్తగా మార్చేసింది. ‘‘కోపం మన ఉద్వేగంలో ఓ భాగమే. దాన్ని ఎంత దారిలో పెట్టాలన్నా కుదరడం లేదు. అయితే అప్పుడప్పుడూ కోపం కూడా మనకు మంచే చేస్తుంటుంది. మనం చేసిన పనుల వల్లో, తీసుకున్న నిర్ణయాల వల్లో కొన్నిసార్లు ఓడిపోతుంటాం. అలాంటి సమయంలో మనపై మనకే కోపం వస్తుంది. అలాంటి సమయంలోనే మన తప్పులేంటో తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ప్రతిసారీ సానుకూలంగానే ఆలోచించడం కుదరని పని. మన ప్రయాణంలో ప్రతికూలతలన్నీ ఇలాంటి సమయంలోనే బయటపడతాయి. అయితే ఓ స్థాయికి మించిన కోపం అస్సలు పనికి రాదు. మన కోపం మనపైనే అయితే ఫర్వాలేదు. పక్కవాళ్లపై అయితే బంధాలు తెగిపోతాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటా’’ అంది కాజల్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com