ఎప్పటి నుండి?

తన భర్త విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అని కితాబిచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. ఆమె హీరోయిన్గా నటించిన తాజా చిత్రం `సూయీ ధాగా`. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్కను `మీరు ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్ను పెళ్లి చేసుకున్నారు కదా` అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన అనుష్క.. `నేను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నాన`ని జవాబిచ్చింది. అంతేకాకుండా తమ వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకుంది.`మేము బయట పెద్ద సెలబ్రిటీలం కావొచ్చు. కానీ, ఇంట్లో సాధారణ భార్యాభర్తల్లాగానే జీవించడానికి ఇష్టపడతాం. మాకు పాపులారిటీపై పెద్ద వ్యామోహం లేదు. ఈ స్టార్డమ్కు దూరంగా ఏకాంతంగా బతకాలని అనిపిస్తుంటుంది. ఇతరులకు మాపై రకరకాల అభిప్రాయాలుంటాయి. కానీ, మా గురించి మాకు తెలుసు. మా విలువేంటో తెలుసు` అని అనుష్క చెప్పింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com