ఆకలి ఎక్కువ-శక్తి తక్కువ! మధుమేహం నివారణ ఎలా?

🍎 మధుమేహవ్యాధి గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవండి.
🍎మధుమేహ వ్యాధి రెండు రకాలు.
🍎ఒకటి టైప్ 1 డయాబెటిస్.
🍎ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
🍎ఇన్సులిన్ తయారీ తగ్గిపోవటం వలన ఈ రకమైన వ్యాధి కలుగు తుంది.
🍎రెండవది టైప్ 2 డయాబెటిస్.
🍎ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగిన శరీరం దీనిని వినియోగించు కోలేదు.
🍎90 శాతం మందిలో ఈ రకమైన డయాబెటిస్ కనిపిస్తోంది.

🍏లక్షణాలు🍏
🍎మధుమేహ వ్యాధి భారినపడిన వారిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
🍎అతిగా దాహం వేయడం,
🍎ఆకలి ఎక్కువగా అవటం,
🍎తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
🍎వీటితో పాటు బరువు కూడా తగ్గుతారు.

🍎కారణాలు🍎
🍎మధుమేహ వ్యాధి రావడానికి జీవన శైలి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
🍎ముఖ్యంగా పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినటం, సమయపాలన లేని భోజనం వంటివి మధుమేహ వ్యాధికి కారణం అని చెప్పవచ్చు.
🍎ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమించే అవకాశం కూడా ఉంది.

🍏పరీక్షలు🍏
🍎మధుమేహ వ్యాధి ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఉదయాన ఖాళీ కడుపుతో రక్త పరీక్ష, భోజనం తరువాత రక్త పరీక్ష చేయించాలి.
🍎అంటే భోజనం చేయక ముందు ఒకసారి మరియు చేసిన తరువాత ఒకసారి రక్త పరీక్ష చేయించాలి.
🍎భోజనం చేయక ముందు లభించిన నమూనాలో విలువ 126 కన్నా తక్కువ ఉండాలి.
🍎తిన్న తరువాత 140 నుంచి 200 మధ్య ఉండాలి.
🍎తినకుముందు 100 కన్నా తక్కువ, తిన్న తరువాత 140 కన్నా తక్కువ ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు లేవని చెప్పవచ్చు.
🍎గర్భిణులు తప్పనిసరిగా మధుమేహ వ్యాధి పరీక్ష చేయించుకోవాలి.
🍎వీరికి ముందుగా 75 గ్రాముల గ్లూకోజ్ తినిపించి మూడు సార్లు నమూనాలని తీసుకుంటారు.
🍎జీరో అవర్‌లో 90కన్నా తక్కువ, 1 గంట తరువాత 180 కన్నా ఎక్కువ, 2 గంటల తరువాత 150 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
🍎సాధారణంగా డెలివరీ తరువాత గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి.
🍎కొంత మందిలో మాత్రం మధుమేహ వ్యాధి పెరిగే అవకాశం ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com