DailyDose

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సీబీఐ దాడులు-నేరవార్తలు

Crime News - CBI Raids Continue In Telugu States

* తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు..తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.సున్నపు రాయి అక్రమ మైనింగ్‌ పై సీబీఐ విచారణ జరుపుతుంది.రెండు రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు నిర్వహించింది సీబీఐ.గుంటూరు, హైదరాబాద్‌ లోని ప్రాంతాల్లో సోదాలు జరిపారు అధికారులు.మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ.సోదాల్లో పలు డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్, నగదు ను స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మైనింగ్‌ కు సంబంధించిన 17 కేసులను సీబీఐ కి బదిలీ చేసింది సీఐడీ.ఆగష్టు 26 వ తేదీన కేసు నమోదు చేసింది సీబీఐ.2014 నుంచి 2018 పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.దాంతో శానిలైట్ ఇమేజెస్‌ అధారంగా మైనింగ్ ఆధారాలను సేకరిస్తున్నారు సీబీఐ.అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగు తున్నాయి.

* జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

* కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడటం పాకిస్థాన్‌కు నిత్య కృత్యమైపోయింది.జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో, నౌషేరా సెక్టర్‌లో నియంత్రణ రేఖ వెంబడి శనివారం పాకిస్థాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.దీంతో ఓ భారతీయ జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్ దళాలకు భారతీయ దళాలు దీటుగా బదులిస్తున్నట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది.ఈ కాల్పుల్లో మన దేశానికి చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అమరుడైనట్లు తెలిపింది. శత్రువుల కాల్పులకు మన దళాలు గట్టిగా బదులిచ్చినట్లు పేర్కొంది.సంగ్రామ్ శివాజీ మొదట తీవ్రంగా గాయపడ్డారని, ఆ తర్వాత కొద్ది సేపటికి తుది శ్వాస విడిచారని తెలిపింది.

* ప్రమాదానికి గురైన ఎపి స్పీకర్ తమ్మినేని సీతారాం బులెట్ ప్రూఫ్ కారు.రూరల్ మండలం వాకలవలస, వంజంగి గ్రామాల మద్య పాలకొండ రోడ్డు పై వాహన ప్రమాదం.శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వస్తుండగా స్పీకర్ కాన్వాయి లోకి చొరబడి కారును ఢీ కొన్న ఆటో.ఆటోను తెప్పించే ప్రయత్నంలో పొలాల్లోకి దూసుకు పోయిన స్పీకర్ వాహనం.కారును ఢీ కొని బోల్తా పడ్డ ఆటోలోని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు.గాయపడిన క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి స్పీకర్ దగ్గరవుండి తరలింపు.ప్రత్యామ్నాయ వాహనంలో ఇంటికి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం.స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన పెను ప్రమాదం.

* జోర్హాట్‌ రాజామైదం రోడ్‌లోని నివాస సముదాయాల్లో అగ్నిప్రమాదం సంభవించింది.పదికి పైగా ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. ‘ఛఠ్​ పూజ’ సందర్భంగా ఇళ్లలో దీపాలు వెలిగించే క్రమంలో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు.ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది.

* దాచేపల్లి మండలం నడికూడి భ్యాంక్ లో చోరీ.అర్థరాత్రి సీసీ కెమెరాలు బ్లాక్ చేసి గ్యాస్ కట్టర్లతో గేటులు కట్ చేసి దోంగతనానికి పాల్పడిన దుండగులు.90 లక్షలు చోరీ! సంఘటన స్థలానికి చేరుకు గురజాల డియస్పి జయరామ్ ప్రసాద్.క్లూస్ టీమ్ సిబ్బంది భ్యాంకుకు రావటంతో ఘటనను గుర్తించి పోలీసులకు పిర్యాదు.

* పోలవరం ప్రాజెక్ట్ వద్ద 49 వ బ్లాక్ క్రషర్ లో పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసిన కార్మికులు.మృతుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తింపు.మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి తమకు భద్రత కల్పించాలంటూ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కార్మికులు ఆందోళన.పరిస్థితిని సమీక్షిస్తున్న ఎ ఆర్ ఎస్పీ మహేష్ కుమార్.