DailyDose

చెన్నైలో అమిత్‌షాపై ప్లకార్డు విసిరిన వ్యక్తి అరెస్ట్-తాజావార్తలు

Man Who Threw Placcard On Amit Shah Arrested In Chennai

* చెన్నైలో అమిత్ షాపై ప్లకార్డు విసిరిన వ్యక్తితమిళనాడులో అమిత్ షా పర్యటనగో బ్యాక్ అమిత్ షా అంటూ రాసిన ప్లకార్డు విసిరిన వ్యక్తిపోలీసుల అదుపులో చెన్నై వాసి దురైరాజ్కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ చెన్నైలో పర్యటించారు. రెండ్రోజుల తమిళనాడు పర్యటన కోసం ఆయన ఇవాళ చెన్నై వచ్చారు.విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన ఆయన కాలినడకన పార్టీ శ్రేణులకు, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.అయితే జీఎస్టీ రోడ్డు వద్ద అమిత్ షాపై ఓ వ్యక్తి గో బ్యాక్ అమిత్ షా అని రాసి ఉన్న ప్లకార్డును విసిరాడు.దాంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆ ప్లకార్డును అందుకున్నారు.దాన్ని విసిరిన వ్యక్తిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ వ్యక్తిని చెన్నైకి చెందిన 67 ఏళ్ల దురైరాజ్ అని గుర్తించారు.

* గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46, 232 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 564 మంది మృతి.దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 90, 50, 598 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.ప్రస్తుతం 4, 39, 747 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 84, 78, 124 మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1, 32, 726 మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 49, 715 మంది బాధితులు.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.67%, మరణాల రేటు 1.47%.

* తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే నేత, సీఎం పళనిస్వామి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాష్ట్ర పర్యటనలో ఉన్న సందర్భంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పళనిస్వామి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాతో మా పొత్తు కొనసాగుతుంది. మేం సంవత్సరాల తరబడి మంచి పరిపాలన అందజేశాం. 2021లో మా కూటమి విజయం సాధిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని అన్నారు.

* భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్లీ 49,715 కొత్త కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. పండగ సీజన్‌, చలికాలం కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కేంద్రం.. అందుకనుగుణంగా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారీగా టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని తాజాగా మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారిని గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సూచిస్తోంది. దీంతో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు సగటున 10లక్షల పరీక్షలు చేస్తున్న అధికారులు.. గడిచిన 24గంటల్లోనే 10,66,022 టెస్ట్‌లు చేసినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి.

* బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్‌ వినియోగం కేసులో హాస్యనటి భారతీ సింగ్‌ అరెస్టయ్యారు. ఆమె నివాసం, కార్యాలయాల్లో సోదాల అనంతరం భారతీసింగ్‌ దంపతులను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులు విచారించారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ డ్రగ్స్‌ వినియోగించినట్టు అంగీకరించారని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సోదాల సమయంలో వారి ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఓ డ్రగ్‌ వ్యాపారిని విచారించగా ఆమె పేరు బయటకు రావడంతో ఆమె ఇంట్లో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా బాంద్రాలోని ఆమె నివాసంలో 86.5గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముంబయిలోని మరో రెండు చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు.

* భాగ్యనగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులంతా దాదాపుగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రచారపర్వంలోకి దిగుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రచారానికి వెళ్లే మార్గంలో ఆరుబయట చిన్నారులకు స్నానం చేయించడం, దుస్తులు ఇస్త్రీ చేయడం, టిఫిన్‌ సెంటర్లల్లో దోశెలు వేయడం.. ఇలా తమదైన విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. ఇదంతా ఎన్నికల సమయంలో సహజమే అయినప్పటికీ హైదరాబాద్‌లో ఓ కార్పొరేటర్‌ మాత్రం ఇంతకంటే ప్రత్యేకంగా ఉండాలని ఎప్పుడూ ఉవ్విళ్లూరుతుంటారు. తన మార్కు ప్రచారశైలితో ప్రజలతో మమేకమవుతున్నారు. ఆయనెవరో కాదు హయత్‌నగర్‌కు చెందిన తెరాస కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డి.

* ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌’ చిత్రీకరణలో సత్యం కంప్యూటర్స్‌ మాజీ ఛైర్మన్‌ రామలింగరాజు సూచనలతో నిక్షిప్తపరిచిన సమాచారాన్ని వినియోగించుకోవడానికి ఆయన మేనేజరు హరి అనుమతులు ఇచ్చారని… అయితే ఇప్పుడు హరి ఎవరో తనకు తెలియదంటూ రామలింగరాజు మాట మార్చారని నెట్‌ఫ్లిక్స్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు కూడా వివరాలను హరికి పంపామని, ఆయన అభినందనలు తెలిపారని వివరించారు. అయినా అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకోవడానికి, డాక్యుమెంటరీ పేరు పెట్టడానికి ఎవరి అనుమతులూ అవసరం లేదన్నారు. ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌’ డాక్యుమెంటరీని నిలిపివేస్తూ కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసెస్‌ ఇండియా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణను కొనసాగించింది. నెట్‌ఫ్లిక్స్‌ తరఫు న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదనలు వినిపిస్తూ ఇది రామలింగరాజు ప్రైవేటు, వ్యక్తిగతానికి సంబంధించిన అంశం కాదని, కార్పొరేట్‌ వ్యవహారమని, ఇది పెద్ద ఆర్థిక నేరమని తెలిపారు. ఇందులో ప్రజలకు, వాటాదారులకు, కంపెనీలకు సంబంధం ఉందన్నారు. 12 ఏళ్లుగా ప్రజాబాహుళ్యంలో సమాచారం ఉందని, రామలింగరాజు చేసిన తప్పును అంగీకరిస్తూ స్వయంగా లేఖ విడుదల చేశారని చెప్పారు. కోర్టు రికార్డులోని సమాచారాన్ని వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం రికార్డుల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని వినియోగించుకోవడంలో చట్టం ఏమేరకు అనుమతిస్తుందన్న దానిపై వాదనలు వినిపించాలంటూ తదుపరి విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది.

* ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. వర్చువల్‌ పద్ధతిలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపేట, నెల్లూరు జువ్వలజిన్న హార్బర్లకు జగన్‌ శంకుస్థాపన చేశారు. మత్స్సకారుల జీవితాలు దయనీయ పరిస్థితుల్లో ఉండడాన్ని పాదయాత్రలో గమనించానని, అందుకే హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

* నాలుగేళ్ల పాలనలో ఇరాన్‌పై కత్తిగట్టి కఠిన ఆంక్షలు విధించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇటీవల ఆ దేశంపై దాడికి కూడా సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో అధికార పీఠాన్ని వీడే చివరి రోజుల్లో ట్రంప్‌ నుంచి ముప్పు తప్పదని భావించిన ఇరాన్‌ అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండండంటూ తన మిత్రదేశాలను కూడా హెచ్చరించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని, అలా చేస్తే ట్రంప్‌ రెచ్చిపోయే ప్రమాదముందని మధ్యప్రాచ్యంలోని ఇరాన్‌ మిత్రదేశాలకు సూచించింది.