భారతీయులు అమెరికాకు ఎగబడుతున్నారు

మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేవారి సంఖ్య 2016తో పోలిస్తే 2017లో 6.5% మేర పెరిగినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. 2016లో 12.06 లక్షల మంది, 2017లో 12.85 లక్షలమంది వెళ్లారని తెలిపింది. అమెరికా ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఈ లెక్క వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అమెరికాకు భారతీయుల రాకపోకలు తగ్గుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com