ఆ దిక్కుమాలిన ఫోన్లతో మెదడు నాశనం అయిపోతోంది

సాంకేతిక వినియోగం పెరిగిపోవడంతో యువత జ్ఙాపకశక్తిని కొల్పోతోందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లితెర, కంప్యూటర్‌ కారణంగా మానవ సంబంధాలతో పాటు కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ, నైట్‌ ఎంజిల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైటెక్‌ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రపంచ అల్జీమర్స్‌ డే-2018 అవగాహన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ఆయన సతీమణి విమల నరసింహాన్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ విభాగం కార్యదర్శి పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్జీమర్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘అల్జీమర్‌ అవర్‌థన్‌ వాక్‌’ను గవర్నర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులు ప్రార్థన చేయలేకపోతున్నారని… ప్రార్థన చేసేందుకు కూడా ఐ ప్యాడ్‌లు వినియోగించడం బాధాకమరన్నారు. గతంలో విద్యార్థులకు వేదాలు కంఠస్థం వచ్చేవని … కానీ ఇప్పుడు కనీసం తమ సొంత ఫోన్‌ నెంబర్‌ సైతం చెప్పలేని స్థితిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. అభివృద్ధి లేని సాంకేతికత వ్యర్థమన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com