కెరీర్ భయంతో…

గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత బాలీవుడ్ నటుడు అంగద్‌ బేడీని వివాహం చేసుకున్నారు నటి నేహా ధుపియా. అయితే తాము వివాహం చేసుకోబోతున్నట్లు మీడియాకు కూడా తెలీనివ్వలేదు. మే నెలలో తమ నివాసంలో పెద్దల సమక్షంలో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి బాలీవుడ్‌ దర్శక-నిర్మాత, నేహా స్నేహితుడు కరణ్‌ జోహార్ ట్విటర్ వేదికగా ప్రకటించే వరకూ ఎవ్వరికీ తెలీలేదు. నేహా గర్భం దాల్చడం వల్లే రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఆ తర్వాత వార్తలు వెలువడ్డాయి. అలాంటిదేమీ లేదంటూనే ఇటీవల నేహా, అంగద్‌ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాను గర్భం దాల్చిన సంగతి ఎందుకు దాచాల్సి వచ్చిందో వివరిస్తూ నేహా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘నేను గర్భం దాల్చానని తెలిస్తే నాకు సినిమా అవకాశాలు రావని భయమేసింది. నాకు ఆరో నెల వచ్చే వరకు గర్భం అంతగా పెరగకపోవడం మంచిదైంది. లేకపోతే విషయం అందరికీ తెలిసిపోయేది. అదృష్టవశాత్తు నాకు ఆ సమయంలోనూ నటించే ఎనర్జీ ఉంది.’ అని వెల్లడించారు నేహా. ప్రముఖ నటి కాజోల్‌ నటించిన ‘హెలికాప్టర్‌ ఈలా’ చిత్రంలో నేహా కీలక పాత్ర పోషించారు. ప్రదీప్‌ సర్కార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com