Movies

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక

దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో పేరుగాంచిన నటి రష్మిక మందన. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ అవసరమైన వీడియోలను, కొత్త ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటారు. ఫ్యాషన్‌ రంగంలో ఆమెను ఎంతో మంది అభిమానిస్తుంటారు. ఫ్యాషన్‌ పట్ల ఎంతో అభిరుచి, అవగాహన కలిగివున్న విషయం తెలిసిందే. కన్నడ, తెలుగు సినీ రంగంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘ఈ సంవత్సరానికి ‘నేషనల్ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా రష్మిక మందన ఎంపికైనట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇది ఆమె అభిమానులకు సంతోషకరమైన వార్త అని గూగుల్‌ తెలిపింది.