పదే పదే అదే తప్పు చేస్తున్న జగన్!

వైకాపాకు నెల్లూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌, వైకాపా నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వైఖరి వల్లే మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొమ్మిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలి.. అంత డబ్బు నువ్వు పెట్టగలవా? అని జగన్‌ తనను అడిగినట్లు బొమ్మిరెడ్డి తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com