WorldWonders

అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర మృతి

Alluri Sitarama Raju Followers Balu Dora Dies At 111

111 ఏళ్ల వయసులో అనారోగ్యంతో అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర పరమపదించారు. 1924లో అల్లూరిసీతారామరాజుకి సేవలందించిన బాలుదొరకు నివాళులు. బీరబోయిన బాలుదొర, ఈయన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన వ్యక్తి. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం నాడు మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు. అప్పట్లో ఆయన ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడు. ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, ఆనాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు.