హువేయి నుండి మడతబెట్టుకునే ఫోనులు

త్వరలో హువావే‌ సంస్థ నుంచి మడతబెట్టే (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ ఫోన్‌ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ డిప్యూటీ ఛైర్మన్‌ కెన్‌ హూ ధ్రువీకరించారు. తమ నుంచి వచ్చే తొలి మడతబట్టే స్మార్ట్‌ఫోన్‌లో 5జీ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫోన్‌ 2019 ఏడాది మధ్యలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గతవారం బెర్లిన్‌లో జరిగిన టెక్నాలజీ ట్రేడ్‌ షోలో హువావే సంస్థ సీఈవో రిచర్డ్‌ యూ మాట్లాడుతూ.. ‘‘ఇంకా కంప్యూటర్లే ఎందుకు వాడాలి? చిన్నగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేను మేం పూర్తిగా మార్చేస్తాం. పెద్ద తెరను రూపొందించి దాన్ని సౌకర్యవంతంగా మడతబెట్టుకునేలా తయారు చేస్తాం’’ అని అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com