డాలరు విలువను పడగొడతాం

రూపాయిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువను 68-70 స్థాయికి తీసుకొచ్చేందుకు రెండో విడత చర్యలకు దిగబోతున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. రూపాయి బలోపేతం కోసం ఇప్పటికే తయారీ సంస్థలు విదేశాల్లో రుణాలు తీసుకునే నిబంధనలను సడలించడం, కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ)కు అవరోధాల తొలగింపు, మసాలా బాండ్లకు పన్ను రాయితీల వంటి ప్రోత్సాహకాలను ప్రకటించిన సంగతి విదితమే. ‘ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 12 శాతం తగ్గింది. ఇది తాత్కాలికమే. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే మన దేశానికి డాలర్ల అవసరం ఎంతైనా ఉంది. వాటికి గిరాకీ పెరగడంతోనే రూపాయి మారకపు విలువ బలహీనపడుతోంది. అందుకే అత్యవసరం కాని వస్తువుల దిగుమతులపై త్వరలోనే ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాం. ఎగుమతులను ప్రోత్సహిస్తాం. దీంతో రూపాయి మారకపు విలువను 68-70 స్థాయికి తీసుకొస్తామ’ని గార్గ్‌ వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com