Politics

ప్రశ్నల పరంపర సంధించిన ఉత్తమకుమార్-GHMC-TNI బులెటిన్

ప్రశ్నల పరంపర సంధించిన ఉత్తమకుమార్-GHMC-TNI బులెటిన్

* టీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌కు చేసిందేమి లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. లక్ష ఇళ్లు అని ఒక్క ఇళ్లైనా ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోనే మళ్లీ రిలీజ్‌ చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని, మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో చెప్పిన పనులే చేయలేదు.. మళ్ళీ అవే మాటలు చెప్తున్నారని విమర్శించారు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. గత ఎన్నికల మేనిఫోస్టోనే మళ్లీ విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి ఎక్కడా ఇచ్చారు? 100 రోజుల ప్రణాళిక, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ భవనాలెక్కడ? కరోన ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు? దోబిలకు, సెలూన్లకు ఇప్పటి వరకు ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలెదు? డ్రైనేజ్ సిస్టం ఎందుకు బాగు చేయలేదు?’ అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

* గ్రేటర్‌-2020 ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు ఈసారి బ్యాలెట్‌ పోరులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తక్కువ మంది బరిలో నిలిచారు. పలు చోట్ల ప్రధాన పార్టీల్లో అసమ్మతి స్వరాలు వినిపించినా నేతల మంత్రాంగం ఫలించి చాలా ప్రాంతాల్లో అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే కాలనీల్లో ప్రచారహోరు మొదలవగా ఎన్నికల సంఘం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అధికార తెరాస మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా 149, కాంగ్రెస్‌ 146 చోట్ల బరిలో నిలిచాయి. బహదూర్‌పురా నియోజకవర్గంలోని నవాబ్‌సాబ్‌ కుంటలో కమలం పోటీ చేయట్లేదు. ఇక్కడ భాజపా అభ్యర్థి పోటీకి దిగినా పరిశీలనలో సరైన పత్రాలు సమర్పించలేదని అధికారులు నామినేషన్‌ తిరస్కరించారు.

* మంత్రి కేటీఆర్బీజేపీ నేతల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్తెలంగాణలో కులాలను వర్గాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నారుఒక్క ఎన్నిక కోసం బీజేపీ నేతలు పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారు.ఓట్ల కోసం బండి సంజయ్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారుబండి సంజయ్ కు ఓట్లు కావాలంటే ప్రజల కాళ్ళు పట్టుకుంటే వేస్తారు కదా? సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?మనం హైదరాబాద్ లో ఉన్నామా లేదంటే ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు బీజేపీ వాళ్ళ మాటలు చూస్తుంటేఇవ్వాళ హైదరాబాద్ ప్రజలుగా కలవాల్సిన సమయం వచ్చిందిపచ్చని హైదరాబాద్-తెలంగాణ లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు

* తెలంగాణ భవన్ లో బీసీ సంఘాల తో టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు ,ఈట ల రాజేందర్ సమావేశం…మంత్రి ఈటల రాజేందర్ ……బీసీ లు ,ఎంబీసీ ల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఏకైక సీఎం కెసిఆర్..అసెంబ్లీ ఆవరణలో మూడు రోజులు కొన్ని గంటల పాటూ బీసీ ల సమస్యల పై చర్చించి సీఎం కు నివేదిక ఇచ్చాము..ఆ నివేదిక ఆధారంగా నిర్ణయాలు జరుగుతున్నాయి..119 రెసిడెన్షియల్ స్కూళ్ల ను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం..ఏ పార్టీ చిత్తశుద్ధి తో బీసీ ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందో అందరికీ తెలుసు…మాటలు చెప్పం ,చేసి చూపిస్తున్నాం…ghmc ఎన్నికల్లో బీసీ సంఘాలు టీ ఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం……టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు …….టీ ఆర్ ఎస్ మాటల కన్నా చేతలకే ప్రాధాన్యత నిస్తోంది…ghmc ఎన్నికల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత నిచ్చాము…కొన్ని సమస్యలున్న మాట నిజం ..వాటి పరిష్కారం టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం…పేదరికానికి కులం లేదు ..అందరినీ కడుపులో పెట్టుకుని చూస్తోంది సీఎం కెసిఆర్ యే..మూడు శాసనమండలి సభ్యుల కు అవకాశమిస్తే ఒక్క ఎంబీసీ వర్గానికి ఇచ్చాము…రానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ లకు ప్రాధాన్యత నిస్తామని సీఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు…కుల వృత్తుల పరిరక్షణ కు అనేక చర్యలు చేపట్టాం ..ఫలితాలు రాబట్టాం…సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం..పూల బొకే లాంటి హైదరాబాద్ ను విచ్చిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు…బీజేపీ కి చెందిన పెద్ద మనిషి పిచ్చిగా మాట్లాడుతున్నారు..పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెడుతున్నారు…నాలుగు ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండటం ఇదే మొదటి సారి చూస్తున్న..హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారట…హోష్ లో ఉండే మాట్లాడుతున్నారా ?…హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ..దీన్ని చెడ గొట్టే ప్రయత్నం కోసమే దిగ జారి మాట్లాడుతున్నారు..ఎవరేం మాట్లాడుతున్నారో బేరీజు వేసుకోండి…ఎంబీసీ లను కలుపుకుని పోతున్నాం..టిక్కెట్లు ఇచ్చాము ..ముందు కూడా ఇస్తాం..అందరి హైదరాబాద్ ను కొందరి హైదరాబాద్ గా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిద్దాం…37 బీసీ సంఘాలు ghmc ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ కు మద్దతునివ్వడం శుభ పరిణామం.

* పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.5లక్షల సాయం. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం. కాంగ్రెస్‌‌ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మాణికం ఠాగూర్. హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యం గ్రేటర్‌ ప్రజలపై కాంగ్రెస్‌ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్‌లో గెలిపిస్తే.. వరద బాధితులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ మాణికం ఠాగూర్‌ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగర అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ పలు రకాల వరాలను ప్రకటించారు. గ్రేటర్‌లో గెలిస్తే.. ఉచితంగా 30 వేల లీటర్ల మంచి నీటిని అందిస్తామన్నారు.

* టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్‌ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై షార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను నిలదీశారు.

* జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ ఉదయం వీరు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి నేడు బీజేపీలో చేరనున్నారు. పవన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, విజయశాంతి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

* గ్రేటర్‌-2020 ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు ఈసారి బ్యాలెట్‌ పోరులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తక్కువ మంది బరిలో నిలిచారు. పలు చోట్ల ప్రధాన పార్టీల్లో అసమ్మతి స్వరాలు వినిపించినా నేతల మంత్రాంగం ఫలించి చాలా ప్రాంతాల్లో అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే కాలనీల్లో ప్రచారహోరు మొదలవగా ఎన్నికల సంఘం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అధికార తెరాస మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా 149, కాంగ్రెస్‌ 146 చోట్ల బరిలో నిలిచాయి. బహదూర్‌పురా నియోజకవర్గంలోని నవాబ్‌సాబ్‌ కుంటలో కమలం పోటీ చేయట్లేదు. ఇక్కడ భాజపా అభ్యర్థి పోటీకి దిగినా పరిశీలనలో సరైన పత్రాలు సమర్పించలేదని అధికారులు నామినేషన్‌ తిరస్కరించారు.2020 బల్దియా ఎన్నికల బరిలో అత్యధికంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం జంగమ్మెట్‌ డివిజన్‌ నుంచి 20 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 2016 ఎన్నికల్లోనూ ఈ డివిజన్‌ నుంచి అత్యధికంగా 28 మంది పోటీపడటం గమనార్హం. అత్యల్పంగా ఉప్పల్‌, జీడిమెట్ల, బార్కాస్‌, నవాబ్‌సాబ్‌ కుంట, టోలిచౌకి డివిజన్లలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు.

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో మొత్తం 1122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార తెరాస 150 స్థానాల్లోనూ తన అభ్యర్థులను నిలిపింది. నవాబ్‌సాహెబ్‌కుంట తప్ప మిగతా 149 స్థానాల్లో భాజపా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ 146, ఎంఐఎం 51 చోట్ల పోటీ చేయగా.. తెదేపా 106, సీపీఐ 17, సీపీఎం 12 చోట్ల తమ అభ్యర్థులను నిలిపింది. మొత్తం 415 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అత్యధికంగా జంగమ్మెట్‌లో 20 మంది.. అత్యల్పంగా ఉప్పల్‌, బార్కాస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలీచౌక్‌, జీడిమెట్ల వార్డుల్లో ముగ్గురు అభ్యర్థులు చొప్పున పోటీ చేస్తున్నారు.