సన్నీని బురిడీ కొట్టించారు

హాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న సిరీస్‌లో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ ఒకటి. ఇప్పటివరకు ఈ సిరీస్‌ నుంచి ఏడు సీజన్లు ప్రసారం అయ్యాయి. అయితే ఈ సూపర్‌హిట్ సిరీస్‌లో తనకు నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ సన్నీ లియోనీ. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లో నటించే అవకాశం వచ్చిందని సంబరపడిపోయేలోపే అది అబద్ధమని తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. ‘ఓరోజు ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లో నటించే అవకాశం ఇస్తున్నామని ఓ వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌లో ‘ఆఖరి సమయంలో మిమ్మల్ని తీసుకుంటున్నామని తెలుసు. కానీ మిమ్మల్ని ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లో ఓ పాత్రకు ఎంపికచేయాలనుకుంటున్నాం’ అని రాసుంది. అది చూడగానే నా ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.’ అని వెల్లడించారు. ఆ తర్వాత తనకు వచ్చిన మెసేజ్‌ ఫేక్‌ అని తెలిసింది. దాంతో తాను చాలా బాధపడ్డానని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com