సరికొత్త మెట్రో ప్రారంభం

భాగ్యనగరానికే తలమానికమైన హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) మార్గం సోమవారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌.. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వెళ్లే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com