తిరుమల పర్యటనలో ఉప-రాష్ట్రపతి వెంకయ్య

స్వామి దర్శన భాగ్యం మనకే కాదు, అందరికీ దక్కేలా చేయడంలో ఆనందం ఉంటుంది. అందుకే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు వీలైనంతగా రాకను తగ్గించుకోవడం ద్వారా స్వామి దర్శనం సామాన్యులకు మరింత సులభతరమౌతుంది.

కలియుగదైవం తిరుమల శ్రీనివాసుని దర్శనభాగ్యం లభించింది. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉండేవిధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని ప్రార్ధించాను.

అనంతరం భారతీయ విద్యాభవన్ సంస్థ అందచేచేసే వివిధ రంగాల ప్రతిభావంతులకు పురస్కారాల అందచేచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతీయ విద్యాభవన్ సంస్థలను సందర్శించడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. దీనికి ఇక్కడ చదువుకునే పిల్లలు ఓ కారణమైతే, విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి బీజాలు నాటే విద్యాసంస్థ కావడం మరోకారణం. విద్యార్థుల్ని కలవడం, వారితో మాట్లాడ్డం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తూ ఉంటాను.

ఆచార్య ఎన్జీ రంగా స్ఫూర్తితో 1981లో ప్రముఖ గాంధేయవాది శ్రీ పి. రాజగోపాల్ నాయుడు గారి నేతృత్వంలో స్థాపితమైన ఈ రాష్ట్రీయ సేవా సమితి – రాస్ సంస్థ దినదిన ప్రవర్థమానమైంది. రాజగోపాల్ నాయుడు తర్వాత గాంధేయవాది డాక్టర్ నిర్మలా దేశ్ పాండే గారి నేతృత్వంలో నడిచి ఎందరికో బాసటగా నిలిచింది.

అన్ని దిశల నుంచి ఉన్నతమైన ఆలోచనలను స్వాగతించడమే భారతీయ విద్యాభవన్ నినాదం. విద్యార్థులంతా వారి సాంస్కృతిక, నైతిక విలువలకు కట్టుబడి జీవితంలో ఉన్నత స్థానాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

పిల్లలకు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా నేర్పించే ప్రయత్నం చేయాలి. స్వచ్ఛభారత్, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ లాంటి వాటి పట్ల జాగృతం చేయాలి. సమాజంలో పేరుకుపోయిన వివిధ రుగ్మతలకు వ్యతిరేకంగా పిల్లల్ని చైతన్యవంతుల్ని చేయాలి.

దేశానికి నాయకత్వం వహించే సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యంగా, యువతకు జాతీయ భావాలు నూరిపోసి, నైపుణ్యం, లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్న దేశభక్తులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి. చదువు మాత్రమే చాలదు, సమాజానికి జ్ఞానాన్ని అన్వయించి అమలు చేసే మేధావులు కావాలి.

విద్యలోని పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం మార్కుల కోసం, సర్టిఫికేట్, గ్రేడ్ ల కోసం చదవడం వల్ల, చదువు దాని విలువను కోల్పోతోంది. దేశానికి నాయకత్వం వహించే భవిష్యత్ భారత భాగ్యవిధాతల్ని తయారు చేయడమే లక్ష్యంగా విద్యారంగంలో మార్పులు రావాలి.

చిన్నతనం నుంచే మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. వ్యక్తిత్వాన్ని నిర్మించే అనేక పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మన ప్రాచీన రుషులు, నవీన వైతాళికులు, మరెందరో మహనీయులు తమ అనుభవాలు రంగరించి అందించిన ఎన్నో విలువలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి.

ఈ పాఠశాల విద్యార్థులుగా మీరంతా మీ జీవితంలో విలువలను అలవాటు చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటిమానవులను గౌరవించాలి. సాటి జీవుల పట్ల కరుణ, సేవాభావాన్ని మనసులో పెంపొందించుకోవాలి. అందరూ కలిసి సమిష్టి భావనతో దేశాభివృద్ధి కోసం కృషి చేయాలి.

ఒక ఉన్నతమైన సంకల్పంతో డాక్టర్. కె. ఎమ్. మున్షిగారి ఆధ్వర్యంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల క్రాంతదర్శనానికి ప్రతిబింబంగా, స్వరాజ్య సంగ్రామ సమయంలో ఈ విద్యాసంస్థలకు అంకురార్పణ జరిగింది.

ఉపరాష్ట్రపతి అయ్యాక నేను దృష్టి పెట్టిన అంశాల్లో వ్యవసాయం కూడా ఒకటి. దీని కోసం ఇప్పటికే జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలతో కలిసి కొన్ని సంప్రదింపులకు శ్రీకారం చుట్టడం జరిగింది. నా ఉద్దేశం ఒక్కటే పరిశోధనా శాలల నుంచి ఫలితాలు వ్యవసాయ క్షేత్రాల వరకూ చేరాలి.

కారణాలు ఏవైనా కావచ్చు, సమాజంలో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు… ఇలా ప్రతి రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నప్పటికీ ఇది ఇలానే కొనసాగుతోంది. చాలా విభాగాల్లో పురుషుల కంటే మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు.

మహిళాసాధికారత అనే విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించి, అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీని కోసం మార్పు సమాజం నుంచి మొదలు కావాలి. ప్రస్తుతం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాష్ట్రీయ సేవా సమితి – రాస్ నిర్వహిస్తున్న“మహిళా సాధికారత – ఆదర్శ రైతులు” సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాల్లో ప్రత్యేకించి మహిళలు, వ్యవసాయ సంఘాల్ని భాగస్వాముల్ని చేస్తూ సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు సంస్థ కృషి చేయడం ఆనందదాయకం.

వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అవలంబించి, మంచి ఫలితాలు అందుకున్న ఆదర్శరైతుల్ని సన్మానించడం మహదానందంగా ఉంది.

రాస్ సహకారంతో స్వయం ఉపాధి లో విభిన్న కార్యకలాపాలను చేపట్టి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్న పలువురు మహిళలను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉన్నది.

ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళలు, రైతుల్ని ప్రోత్సహిస్తున్న రాస్ సంస్థను, సంస్థ నిర్వాహకులైన అధ్యక్షులు శ్రీ సుబ్బరామిరెడ్డి గారిని, జనరల్ సెక్రటరీ డాక్టర్ జి. మునిరత్నం నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

రాస్ సంస్థ ద్వారా లబ్ధి పొంది, ఆర్థికంగా నిలదొక్కుకుని, మీ ప్రతిభను నిరూపించుకున్న మహిళలకు, ఆదర్శ రైతులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com