ఇది నురగ కాదు. వినాయక విగ్రహ నిమజ్జన ఘనత.

ఈ దృశ్యాలను చూస్తుంటే మంచంతా నేలను పరుచుకొని ఉన్నట్లు ఆహ్లాదంగా కనిపిస్తుంది కదా. వెంటనే అక్కడ ఫొటోలు దిగాలని, ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తుందా మీకు. కానీ అదంతా రసాయనాలతో నిండిన యుమునా నది పరవళ్లు. ఆ తెల్లని నురగంతా కలుషితానికి చిరునామాగా ఉన్న నురగ. పరిశ్రమల్లోని రసాయనాలు, వినాయక విగ్రహాల నిమజ్జనాలతో చేరిన ప్లాస్టర్ ఆఫ్‌ ప్యారిస్‌ నదులకు ఆ దుస్థితిని కలిగిస్తున్నాయి. గణేశ్‌ నిమజ్జనం అనంతరం ఓ ఆంగ్లపత్రిక తీసిన ఈ ఫొటోలు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. విగ్రహాల నిమజ్జనంపై 2010లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దాన్ని అనుసరించి ఓ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ వంటి వాటితో తయారు చేసినవి కాకుండా, పర్యావరణ హితమైన రంగులని వాడినవే మాత్రమే ఆ నదిలో నిమజ్జనం చేయాలి. కానీ ఆ హెచ్చరిక బోర్డును ఎవరూ ఖాతరు చేయడం లేదు. మనం నదులను గంగా సమానంగా భావించి, పూజిస్తాం. అయితే ప్రస్తుతం అవి కాలకూట విషం నింపుకొన్నాయి. అయితే ఆ పరిస్థితికి కారణం మనుషులు చేసే స్వార్థ పూరిత ఆలోచనలే. నదుల పునరుజ్జీవనం పేరుతో కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమంతో ముందుకు వచ్చినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com