Politics

NTR మహనీయుడు:చంద్రబాబు

Chandrababu Counters MIM Owaisi Comments On NTR Ghat

ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా?

– టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు..

తెలుగువారికి  గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగువెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావులు.

దేశంలో పేదల సంక్షేమానికి బాటలువేసింది ఎన్టీఆర్ అయితే… ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ.

ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా?

హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసు.

అటువంటి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.

నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమే.