రొమ్ము క్యాన్సర్ గురించి పాట

టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నది.

తాజాగా ఐ టచ్ మైసెల్ఫ్ పేరుతో విడుదలైన ఆమె పాట వైరల్‌గా మారిపోయింది.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా ఆమె ఈ వినూత్న ప్రయత్నానికి తెర తీసింది.

బ్రెస్ట్ క్యాన్సర్ నెట్‌వర్క్ ఆస్ట్రేలియాకు మద్దతివ్వడంలో భాగంగా ఆస్ట్రేలియా బ్యాండ్ డివినిల్స్ 1991 హిట్ సాంగ్‌ను సెరెనా పాడింది.

ఈ సమయంలో ఆమె టాప్‌లెస్‌గా ఉండటం విశేషం.

తన రొమ్ములను చేతులతో కవర్ చేసుకుంటూ పాడిన ఈ పాటను సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలలో భాగంగా మహిళలంతా తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలని చెబుతూ.. తాను ఐ టచ్ మైసెల్ఫ్ పాట పాడినట్లు విలియమ్స్ ఆ పోస్ట్‌లో చెప్పింది.

ఇది తనకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన చనిపోతున్న మహిళల్లో అవగాహన పెంచేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు ఆమె స్పష్టంచేసింది.

ఈ వీడియో పోస్ట్ చేసిన పది గంటల్లోనే 15 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com