ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విడుదల చేసిన ప్రకటనపై ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారని పిటిషన్‌లో ఆక్షేపించారు. ఎస్‌ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటికే 6వేల మందికిపైగా మరణించారని.. ఈ సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు..
ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకెళ్లిన జగన్ సర్కార్
Related tags :