నువ్వులనూనెతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఆటకట్టు

నీళ్లలో ఎక్కువగా పనిచేసే వారిలో పాదాలు, అరిచేతులు పాచినట్లు అవడం, పగుళ్లు సర్వసాధారణమే. ఆ ప్రాంతంలో చర్మం విడిపోయినట్లుగా, పగిలిపోయినట్లుగా అవుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే ఆ పగుళ్ల నుంచి రక్తం, చీము కారడం, దురద వంటి సమస్యలు కూడా తప్పవు. బురద, వాననీటిలో నడిచినా, డిటర్జెంట్‌ సబ్బులు, వంటసోడా ఎక్కువగా చర్మానికి తగిలినా కూడా ఈ సమస్యలు ఎదురవుతాయి. దీనికేం చేయాలంటే…
* నీళ్లలో పనిచేయడం పూర్తయిన వెంటనే పాదాలను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుని, మెత్తటి వస్త్రంతో తడి పూర్తిగా పోయేలా తుడవాలి. ఆ తరువాత పాదాలకు ఆముదం లేదా నువ్వులనూనెతో మర్దన చేసుకోవాలి. ఈ నూనెలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
* వేపాకులు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు తగినంత వేడిగా ఉన్నప్పుడు పాదాలని అందులో పదినిమిషాలు ఉంచాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో తుడిచేసి నూనె రాసుకోవాలి.
* మాను పసుపుని కషాయంలా చేసుకుని, 30 మి.లీ. చొప్పున రెండు పూటలా తాగాలి. మాను పసుపుని గంధంలా చేసుకుని ఇన్ఫెక్షన్‌ ఉన్న భాగాల్లో పూతలా రాసుకోవాలి.
* రెండు వంతులు నెయ్యి, ఒక వంతు తేనె బాగా కలిసేలా గిలకొట్టి దాన్ని లేపనంలా పాదాలకు రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తోంటే ఫలితం కనిపిస్తుంది.
* నువ్వుల నూనెని వేడిచేసి పొయ్యి మీద ఉండగానే, తేనె, మైనం ముక్కలు అందులో వేసి కరగనివ్వాలి. కరిగాక దింపేసి, చల్లారనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దని పాదాలు, అరచేతులు, పగుళ్లు ఏర్పడిన భాగాల మీద పూతలా పూయాలి. కాసేపయ్యాక కడిగేయాలి. ఈ పూతల వల్ల ఫలితం ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com