నానా ఓ దుర్మార్గపు కసికూన

బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్ క్రూరత్వాన్ని తాను కూడా చూశానని నటి డింపుల్‌ కపాడియా అన్నారు. నానా పటేకర్‌ తనను వేధించారని తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆమెకు మద్దతుగా ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు మాట్లాడారు. పటేకర్‌ స్థిరత్వం లేని వ్యక్తని నటి రేణుకా షహానే ఓ లేఖ విడుదల చేశారు. ఆయన స్వభావం వల్ల చిత్ర పరిశ్రమలోని చాలా మంది బాధపడ్డారని‌ అన్నారు. గతంలో పటేకర్‌ గురించి అలనాటి నటి డింపుల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పటేకర్‌ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారా? లేక గతంలోలాగే ఉన్నారా? అని డింపుల్‌ను యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంది’. ‘నటుడిగా నైపుణ్యం విషయానికి వస్తే అతడ్ని మించిన వారు లేరు. అంత అద్భుతమైన నటుడు. అతడి ప్రతిభను చూశాకా.. వంద హత్యలు చేసినా క్షమించాలి అనిపిస్తుంది. నా ప్రాణం కూడా తీసుకో అనాలి అనిపిస్తుంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. అదేవిధంగా అతడిలో చెడు కోణం కూడా ఉంది. ప్రతి ఒక్కరికీ అలాంటి చీకటి కోణం ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com