“చెత్తకు చెత్త అంటుకుంది”

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా అది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..గురువారం ట్రంప్‌ మిన్నియాపోలీస్‌‌-సెయింట్‌ పాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కుతున్నప్పుడు ఆయన ఎడమ కాలి బూటుకు టాయ్‌లెట్‌ పేపర్‌లాంటిది అంటుకుంది. ట్రంప్‌ విమానం ఎక్కుతున్నప్పుడు అది మరీ క్లియర్‌గా కనపడింది. దాంతో అక్కడి ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. కాలికి ఏదో తగులుతున్నట్లు అనిపించినా ట్రంప్‌ దానిని చూసుకోకపోవడం గమనార్హం. విమానంలోకి వెళుతున్నప్పుడు ఆ పేపర్‌ దానంతట అదే ఊడిపోయింది. ఈ టాయ్‌లెట్‌ పేపర్‌ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లు చూడండి.

‘చెత్త మరో చెత్తకు అతుక్కుంది’

‘ట్రంప్‌ మనపై ఏదో ప్రాంక్‌ ప్లే చేస్తున్నట్లున్నారు’

‘నీకు ఏదో చెత్త అంటుకున్నట్టుంది(ఈ విషయాన్ని నేను పేపర్‌కు చెబుతున్నాను)’

‘ఈరోజు మీరు నవ్వకపోతే ట్రంప్‌న‌కు సంబంధించిన ఈ వీడియో చూడండి’

‘ఇది మ్యూజిక్‌తో కూడిన ట్రంప్‌ పేపర్‌వాక్‌’

‘నాకు ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే..ఆయన బూటుకు ఆ పేపర్‌ ఎలా అతుక్కుంది?’

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com