NRI-NRT

బందరు పోలీసులకు హెల్మెట్లు అందించిన తానా-సుధీక్షణ ఫౌండేషన్

Winter Charity To Krishna District Police By TANA-Sudeekshan Foundation

సుదీక్షణ ఫౌండేషన్ (విజయవాడ), తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంయుక్తంగా కలిసి అందజేసిన 100 హెల్మెట్లను, 40రగ్గులను కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు బందరు పోలీసు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులు యొక్క సంక్షేమాన్ని కాంక్షించి సుదీక్ష ఫౌండేషన్ మరియు తానా ఈ విరాళం అందజేయడం సంతోషంగా ఉందని, జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, సుదీక్ష ఫౌండేషన్ ఫౌండర్ చిగురుపాటి విమల, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో కాకాని తరుణ్(తానా జీవిత కాల సభ్యులు), బషీర్ షేక్, తానా సభ్యులు, ఎస్సైలు, ఆర్.ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.