ఆధార్ కంపల్సరీ

బ్యాంకులు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా, అవి తప్పనిసరి అంటున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ. శనివారం జరిగిన హెచ్‌టీ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ ఆమోదం పొందిన చట్టం ద్వారా బ్యాంకులు, మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ అనుసంధానాన్ని తిరిగి తప్పనిసరి చేయొచ్చని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తుందో లేదోనన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. టెలికాం సేవలు పొందేందుకు ఆయా సంస్థలకు ఆధార్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని గత వారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై జైట్లీ స్పందించారు. ఇదో కఠినమైన తీర్పు అని అభిప్రాయపడ్డారు. ‘ఆధార్‌ అనేది పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు. ప్రభుత్వం అందించే ఎన్నో సబ్సిడీలు, ఇతర సహాయాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌ అసలు ప్రయోజనం అదే’ అని అన్నారు. ‘సుప్రీం ఇచ్చిన తీర్పు వెనుక ప్రధాన ఉద్దేశం, జరిగిన వాదనలు ప్రైవేటు సంస్థలు ఆధార్‌ను ఉపయోగించకూడదనే. అయితే, సెక్షన్‌ 57 ప్రకారం చట్టం ద్వారా లేదా, ఏదైనా ఒప్పందం ప్రకారం తప్పనిసరిగా సమర్పించాలి. చట్టం ప్రకారం ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయొచ్చు’’ అని అన్నారు. అయితే, అందుకు సంబంధించి పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చే విషయంపై మాత్రం జైట్లీ మాట్లాడలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com