Movies

ఈ నిర్ణయం థియేటర్లకు లాస్…ప్రేక్షకులకు జోష్

ఈ నిర్ణయం థియేటర్లకు లాస్…ప్రేక్షకులకు జోష్

వార్నర్ బ్రదర్స్ డీల్… థియేటర్లకి వార్నింగ్ బెల్?

థియేటర్లు ఇవాళ కాకపోతే రేపు ఓపెన్ అయిపోతాయని చూస్తోన్న సినీ పంపిణీ రంగానికి, ఎగ్జిబిషన్ రంగానికి ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. 

ఈ డిసెంబర్ నుంచి మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరి వరకు తమ సంస్థ నిర్మించే అన్ని సినిమాలను అటు థియేటర్లలో పాటు ఇటు హెచ్‌బిఓ మ్యాక్స్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కి పెట్టాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించుకుంది. 

ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా హెచ్‌బిఓ సబ్‌స్క్రయిబర్లు థియేటర్లలో రిలీజ్ అయిన నాడే ఇంట్లోనే ఈ చిత్రాలన్నీ చూడొచ్చు. 

సినిమా థియేటర్ వ్యవస్థ ఇప్పట్లో కుదురుకునే అవకాశం లేదని, వచ్చే ఏడాది అంతా ఆ ఒత్తిడి ఎదుర్కోవడం కంటే ఇదే ఉత్తమమయిన మార్గమని వార్నర్ బ్రదర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది సినిమా పంపిణీ పరంగా పెను మార్పులు రావడానికి నాంది అవుతుంది.

ఇప్పటికే ఓటిటి సంస్థలు చాలా అగ్రెసివ్‌గా వెళుతూ థియేటర్లకు ప్రత్యామ్నాయం కావాలని చూస్తోన్న తరుణంలో ఈ వార్త వారికి కూడా ఉత్సాహాన్నిస్తోంది. ఇకపై ఓటిటి డీల్స్ ఇదే విధంగా జరిగే అవకాశముంది. 

భారీ సినిమాలు అటుంచి మధ్యశ్రేణి, లో బడ్జెట్ చిత్రాలకు ఇలా సైమల్టేనియస్ ఓటిటి ప్లస్ థియేట్రికల్ రిలీజ్‌లు వుండే ఛాన్సుంది. 

టికెట్ రేట్లు ఎంతయినా పెట్టుకోవచ్చునని ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన దశలో ప్రేక్షకులు ఇంటికే పరిమితం కావడానికి ఈ ట్రెండ్ మరింత ప్రోత్సహిస్తుంది. ఈ ట్రెండ్ ముదిరితే థియేటర్స్ వ్యవస్థ పెను ప్రమాదంలో పడే అవకాశముంది.