ప్రతీ పర్యటనకు పెళ్ళాం పక్కన ఉంది తీరాల్సిందే

విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ అంశాన్ని కోహ్లీ మొదట ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం ఆ అధికారి ఈ విషయాన్ని వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీకి చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారికంగా అభ్యర్థనను పంపాలని టీమిండియా మేనేజర్‌ సునీల్‌ సుబ్రహ్మణ్యాన్ని పాలకుల కమిటీ అడిగినట్లు సమాచారం. అయితే దీనిపై పాలకుల కమిటీ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ‘విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలనే అభ్యర్థన కొన్ని వారాల క్రితమే వచ్చింది. అయితే ఇది బీసీసీఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అభ్యర్థనను మేనేజర్‌ పంపాల్సి ఉంటుంది. కోహ్లీతో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. అయితే పాత నిబంధనలను మార్చి టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని కోహ్లీ కోరుతున్నాడు.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com