గూగుల్ కన్నా సమర్థుడు….గురువు!-రామినేని ఫౌండేషన్ సభలో వెంకయ్య

మంగళగిరి లో రామినేని ఫౌండేషన్ పురస్కార అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఆయన ప్రసంగ సారాంశం

ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల యొక్క వ్యాఖ్యలు అటు ప్రజానీకానికి నాయకుల పట్ల చులకన భావం ఏర్పడుతుంది. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. రాజకీయ నాయకులు చేసే విమర్శలు హుందాతనంగా ఉండాలి హేతుబద్ధంగా ఉండాలి.ఆలోచన స్థాయి పెరిగే విధంగా మాట్లాడాలి ఉండాలి. కానీ నేడు అనేకచోట్ల కులాల ప్రాతిపదికన వ్యక్తిగత విషయాలు ప్రసంగాలు ప్రమాద స్థాయి దాటి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు ..హిందూ మతం కాదు .అది సంస్కృతి లాంటివి. భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది. భారతదేశానికి వచ్చిన ఇతర దేశాల రాజకీయ నాయకులు ఎవరైనా తమ స్వంత దేశం భాషను మాత్రమే ఇక్కడ మాట్లాడుతుంటే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతూ మాతృభాషకు దూరం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మాతృభాష యొక్క ప్రాధాన్యత గుర్తించి పార్లమెంట్లో ఇరవై రెండు భాషల్లో మాట్లాడడానికి తాను అనుమతి ఇచ్చినట్లు అన్నారు. నేటి ప్రపంచం మొత్తం గూగుల్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ విద్యను బోధించిన గురువును మాత్రం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ కుల, మతాలకతీతంగా దేశమంతా ఒకటేనన్న భావనతో మెలగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట, విశేష పురస్కరాలను ఆయన ఈ రోజు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పద్మభూషణ్‌ డాక్టర్‌ పుల్లెల గోపీచంద్ విశిష్ట పురస్కారాన్ని, మహా సహస్రావధాని డాక్టర్‌ గరికపాటి నరసింహారావు, సినీ దర్శకుడు నాగ అశ్విన్‌రెడ్డి, బాలసాహిత్య వికాసానికి కృషి చేసిన చొక్కపు వెంకటరమణలకు విశేష పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… కళలు, విజ్ఞానం, మానవీయశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరచే వారిని సత్కరించుకోవడం భారతీయ జీవనంలో భాగమన్నారు. కులం, మతం, డబ్బు ఆధారంగా కాకుండా గుణం ఆధారంగా మనల్ని పాలించే నాయకులను ఎన్నుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గి రాద్ధాంతం పెరిగిపోయిందని… ఈ సంస్కృతి మారాలన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com